వైఎస్ జగన్మోహనరెడ్డి జిల్లాల మీటింగులలో తన వెంట్రుక కూడా ఎవరూ పీకలేరు అంటూ జుట్టు మీద వెంట్రుకను టచ్ చేసి మరీ బాడీ లాంగ్వేజ్ తో సహా చూపిస్తున్నారు.ఇక ఇదేం భాష చీఫ్ మినిస్టర్ స్థానంలో ఉన్న వారు ఇలా మాట్లాడవచ్చా అని విపక్షలు కౌంటర్లు వేశాయి కూడా.దీని మీద కాస్తా లేట్ గా అయినా లేటెస్ట్ గా జనసేన అధినాయకుడు పవన్ కళ్యాణ్ గట్టిగానే సెటైర్ వేశారు. మంగళగిరి పార్టీ ఆఫీసులో జనవాణి కార్యక్రమంలో భాగంగా ఆయన మాట్లాడుతూ పవర్ ఫుల్ సెటైర్ వేశారు. కేశ సంపదను అలా తరచూ పీక్కోవద్దమ్మా పదే పదే పీక్కుంటే మొత్తానికి మొత్తం ఊడిపోగలదు జాగ్రత్త అంటూ గట్టిగానే వేసేశారు.
అంటే జగన్ పదే పదే తన జుట్టుని చూపించి వెంట్రులను పీకలేరు అని చేస్తున్న సవాల్ కి ఇది పవన్ మార్క్ పవర్ ఫుల్ రిటార్ట్ అన్న మాట. ఆయన మాట్లాడుతూ మేము విపక్షంగా సమస్యలు దృష్టిలో పెడితే వాటిని పరిష్కరించలేక జుత్తు ఎందుకు పీక్కుంటారు అని తనదైన శైలిలో ప్రశ్నించారు.పూనకాలు వచ్చినట్లుగా బూతులు మాట్లాడడమే వైసీపీ నేతలకు తెలుసు అంటూ ఆయన మండిపడ్డారు ప్రజల సమస్యలను పరిష్కరించాలన్న చిత్తశుద్ధి లేకపోతే పాలకులు గద్దె ఖాళీ చేయాలంటూ లోక్ నాయక్ జయ ప్రకాష్ నారాయణ్ రాసిన కవితను కూడా ఆయన చదివి వినిపించారు.
ఎంతో మంది ప్రజలు సమస్యలతో అల్లాడుతూంటే అన్నీ చేశామని చెప్పుకోవడం ఆత్మ వంచన తప్ప మరేమీ కాదని అన్నారు. తాము ప్రజల కోసం మాట్లాడుతూంటే కొన్ని సమస్యలు అయినా పరిష్కారం అవుతున్నాయని సంతోషంగా ఉందని ఆయన చెప్పడం విశేషం. మొత్తానికి కేశ సంపద గురించి పవన్ పీకిన క్లాస్ మాత్రం వైసీపీ నేతలకు బాగానే తగిలినట్లుగా ఉందేమో.