తాజాగా నాగబాబు విజయనగరం జిల్లాలో జనసేన పార్టీ విస్తృతస్థాయి సమావేశాన్ని ఓ హోటల్లో ఏర్పాటు చేశారు. ఈ సమావేశానికి జనసేన కార్యకర్తలతో పాటు పలువురు జిల్లా నాయకులు వచ్చారు. ఆ కార్యక్రమంలో నాగబాబు చిరంజీవి గురించి, పార్టీ గురించి, మెగా అభిమానుల గురించి పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.నాగబాబు మాట్లాడుతూ.. ”
చిరంజీవి ప్రత్యక్ష రాజకీయాల్లోకి వచ్చే అవకాశం లేదు. కానీ రానున్న ఎన్నికల్లో మాత్రం జనసేనకు చిరంజీవి మద్దతుగా ఉంటారు. ఎక్కడా పోటీ చేయరు. పొత్తులపై అన్నీ ఆలోచించి పార్టీ అధినేత పవన్ కల్యాణ్ నిర్ణయం తీసుకుంటారు. మెగా అభిమానుల మద్దతు ఎవరికి ఇస్తారు అనేది వారి ఇష్టం. జనసేనకే మద్దతుగా నిలుస్తారనుకుంటున్నాను. జిల్లాలో జనసేన పార్టీ పరిస్థితి తెలుసుకునేందుకే ఈ సమావేశం” అని తెలిపారు.