వైఎ్‌సఆర్ చేయూత పథకం కింద గతంలో లబ్ధి పొందిన తమను రాజకీయ కారణాలతో లబ్ధిదారుల జాబితా నుంచి తొలగించారని పేర్కొంటూ గుంటూరు జిల్లా పెదకూరపాడు మండలం గారపాడు గ్రామానికి చెందిన ఆర్.వసంతలక్ష్మి, మరో 26మంది హైకోర్టును ఆశ్రయించారు.
వాలంటీర్ వ్యవస్థ పై మండిపడింది హైకోర్టు ,,ప్రభుత్వ పథకాలకు లబ్ది దారులను నిర్ణయించేందుకు వారికీ ఉన్న అధికారం ఏమిటని కోర్ట్ నిలదీసింది ..వాలంటీర్ వ్యవస్థ చట్ట బద్దమేనా? వారు ప్రభుత్వ ఉద్యోగులా ,,వాళ్లకు సర్వీస్ రూల్స్ ఉన్నాయా?? అని అసహనం వ్యక్తం చేసింది ,,లభి దారుల ఎంపికలో వాలంటీర్ జోక్యం ఏమిటని ప్రశ్నలు కురి పించింది ..లబ్ది దారులను ఎంపిక చేసేందుకు ..పంచాయతీ రాజ్ ,,ప్రభుత్వ యంత్రాంగం వున్నప్పుడు ,,ప్రభుత్వ ఉద్యోగులే కానీ ,వాలంటీర్లతో ఎందుకు ఎంపిక చేస్తున్నారని ,,నిలదీసింది పూర్తీ వివరాలతో కౌంటర్ దాఖలు చెయ్యాలని సంభందిత అధికారులకు ,వాలంటీర్ లకు నోటీసులు జారీ చేసింది ..