భారీ పేలుడుతో దద్దరిల్లిన క్యూబా,,18 మంది మృతి.. 13 మంది ఆచూకీ గల్లంతు


క్యూబా లో భారీ పేలుడు సంభవించింది .
.
రాజధాని హవానాలోని ఫైవ్ స్టార్ హోటల్ లో ఈ ప్రమాదం జరిగింది ..శుక్ర వారం,శక్తివంతమైన పేలుడు సంభవించి ,,18 మంది మరణించగా , 74,మంది గాయపడ్డారు ..గాయపడిన వారిని హాస్పిటలో జాయిన్ చేసారు ..ఐతే గ్యాస్ లీకేజ్ తోనే  ఈ ప్రమాదం జరిగిందని తెలుస్తోంది .

ఈ ఘటన దాటికి చాలా కార్లు  బస్సు లు ధ్వసం అయ్యాయి ,,పక్కనే ఉన్నస్కూల్ వెంటనే కాళీ చేయించారు , ప్రజలు చిక్కుకునే అవకాశం ఉన్నందున వెంటనే గాలింపు చర్యలు ప్రారంభించారు అధికారులు..గ్యాస్ లీక్ వల్లే పేలుడు జరిగిందని అధ్యక్షుడు మిగ్యుల్ డియాజ్ కెనాల్ కార్యాలయం పేర్కొంది ,,ఈ హోటల్ లో ఒక స్విమ్మింగ్ కూల్ ,రెండు రెస్టరెంట్లు ,,రెండు బార్ లు ,,వున్నాయి ..13 మంది గల్లంతు అయినట్టు అధికారులు చెబుతున్నారు ..14 మంది చిన్నారులు సహా 74 మంది గాయపడినట్లు క్యూబా ప్రభుత్వం వెల్లడించింది. హోటల్ సమీపంలోని భవనాల్లోని కుటుంబాలు కూడా పేలుడు కారణంగా ప్రభావితమయ్యాయని, వారిని సురక్షిత ప్రాంతాలకు తరలించామని అధ్యక్షుడు డియాజ్-కానెల్ తెలిపారు. 19వ శతాబ్దపు నిర్మాణ శిథిలాలలో చిక్కుకున్న వ్యక్తుల కోసం అన్వేషణ కొనసాగుతోంది, క్యూబా జాతీయ ఆరోగ్య మంత్రి, జోస్ ఏంజెల్ పోర్టల్, ది అసోసియేటెడ్ ప్రెస్ ద్వారా చెప్పబడింది.