పాలనా దక్షతలేని వ్యక్తి జగన్..నాదెండ్ల మనోహర్


ఏపీ లో.. రోడ్లు, కరెంటు గురించి పక్క రాష్ట్రాలు మాట్లాడుకునే దౌర్భాగ్య పరిస్థితి జగన్ తీసుకొచ్చారని ఆగ్ర‌హం వ్యక్తం చేశారు. నాదెండ్ల మనోహర్ ప్రజల సమస్యల పై ప్రభుత్వం స్పందిస్తుందని, పవన్ కళ్యాణ్ పోరాటం చేస్తున్నార‌ని తెలిపారు. సమస్యలపై ప్రభుత్వ స్పందన లేక రైతులు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారన్నారని ఆవేద‌న వ్యక్తం చేశారు. ఈ నెల 8న సిరువెళ్లలో రచ్చబండ కార్యక్రమంలో పవన్ కళ్యాణ్ పాల్గొంటారని చెప్పారు. వైసీపీ అధికారంలోకి వచ్చాక కర్నూలు జిల్లాలో 400 మంది, రాష్ట్ర వ్యాప్తంగా 3 వేల మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారన్నారు.

రాబోయే ఎన్నికల్లో జనసేన అధికారంలోకి వస్తుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. బలమైన రాజకీయ శక్తిగా జనసేన ఎదుగుతోందన్నారు. జనసేన చేస్తున్న కార్యక్రామలు ఏ రాజకీయ పార్టీ కూడా చేయడం లేదని,…. ఛాలెంజ్ చేస్తున్నానని నాదేండ్ల మనోహర్ అన్నారు. జగన్ కు ప్రభుత్వం పూర్తిగా వైఫల్యం చెందిందన్నారు. జగన్ కుటుంబం కోసం, వైసీపీ కోసం రాష్ట్రాన్ని అంధకారంలోకి నెట్టి వేశారని మండిప‌డ్డారు. గడప గడప కార్యక్రమానికి 2వ తేదీ నుంచి వెళ్లాలని సీఎం చెప్పినా వైసీపీ ఎమ్మెల్యేలు వెళ్లలేకపోతున్నారన్నారని ఎద్దేవ చేశారు. రోడ్లు, కరెంటు, నీటి సమస్యలపై, ప్రజలను, ఎదుర్కొనే ప‌రిస్థితి వస్తుందని వైసీపీ ఎమ్మెల్యేలు భయపడుతున్నారన్నారు.