తిరుపతి ఎమ్మెల్యే "జనసేనానే" ఉండాలని జనసైనికుల కోరిక..



లక్ష ఓట్ల మెజారిటీతో "పవన్" (మా అధినేత కు) గిఫ్ట్ గా ఇస్తాము.
.

తిరుపతి జనసేన పట్టణ కమిటీ మహోత్సవంలో నూతన కార్యవర్గం వెల్లడి...

పట్టణ అధ్యక్షుడు రాజా రెడ్డి సమక్షంలో బాబ్జి, రాజేష్ యాదవ్, మనస్వామి మనోజ్, కిషోర్, సాయి దేవ్ లతో కలిసి ఘనంగా ప్రమాణ స్వీకార కార్యక్రమం నిర్వహించుకున్న జనసేన పార్టీ నాయకులు, వీర మహిళలు, నూతన కమిటీ సభ్యులు మరియు జనసైనికులు..



రానున్న 2024 తిరుపతి అసెంబ్లీ ఎన్నికల్లో తమ జనసేనాని పవన్ కళ్యాణ్ ఎమ్మెల్యేగా పోటీ చేస్తే లక్ష ఓట్ల మెజారిటీతో...  జనసేనాని ని గెలిపించుకుంటామని ... తిరుపతి నగర నూతన కమిటీ ప్రమాణ స్వీకార మహోత్సవానికి ముఖ్య అతిథులుగా చిత్తూరు జిల్లా అధ్యక్షులు డాక్టర్ పసుపులేటి హరిప్రసాద్, తిరుపతి ఇన్ఛార్జ్ కిరణ్ రాయల్ పాల్గొని నూతన కమిటీ సభ్యులకు దిశానిర్దేశం ఇచ్చారు..


జనసైనికులు ఓ సంద్రాన్ని తలపించే విధంగా పాల్గొని.... కాబోయే సీఎం పవన్ అని నినాదాలు చేశారు.. రాష్ట్ర పాలక పార్టీ ప్రజా ప్రతినిధులు  జనసేన పై చేస్తున్న మాటల దాడిని ముక్త కంఠంతో ఖండిస్తూ ఆగ్రహం వ్యక్తం చేశారు... సభ ప్రారంభం ముందు జ్యోతిరావు పూలే విగ్రహానికి పూలమాల వేసి  ర్యాలీగా బాలాజీ కాలనీ లోని లక్ష్మీ నారాయణ కళ్యాణ మండపం చేరుకొని సభ ప్రారంభించారు.