సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్,, పిల్టర్ బెడ్ పరిశీలన


ఈరోజు ప్రకాశంజిల్లా జనసేనపార్టీ అధ్యక్షులు శ్రీ షేక్
రియాజ్ గారి సూచనలు మేరకు ఒంగోలు నగర అధ్యక్షులు మరియు కార్పొరేటర్ శ్రీ మలగా రమేష్ గారి ఆధ్వర్యంలో స్థానిక రంగారాయుడు చెరువు దగ్గర ఫిల్టర్ బెడ్, మామిడి పాలెం చెరువు సమ్మర్ స్టోరేజ్ ట్యాంకు, వెంగ మొక్కల పాలెం వద్ద గల సమ్మర్ స్టోరేజ్ ట్యాంకు ఫిల్టర్ బెడ్ లు  పరిశీలించడం జరిగినది. జరుగుతున్న వేసవి కాలంలో నీటి ఎద్దడి దృష్ట్యా ఫిల్టర్ బెడ్ వద్దగల మోటార్ పంపుల పనితీరును అలాగే  సమ్మర్ స్టోరేజ్ ట్యాంకు లోని నీటిని పరిశీలించడం జరిగినది...


ఈ కార్యక్రమంలో పట్టణ అధ్యక్షులు మలగా రమేష్ మాట్లాడుతూ ఇప్పుడు సమ్మర్ స్టోరేజ్ ట్యాంకు లోని నీరు కేవలం ఒక పది రోజులు మాత్రమే వస్తాయి అని తరువాత సాగర్ నుంచి నీటి సరఫరా లేకపోతే భవిష్యత్ లో ఒంగోలు నగరం నీటి ఎద్దడి ఎదుర్కొనే పరిస్థితి ఏర్పడుతుంది అని కావున తక్షణమే తాగునీటి అవసరాల దృష్ట్యా సాగర్ నుంచి నీటిని విడుదల చేయాలని డిమాండ్ చేశారు.ఉపాధ్యక్షులు పిల్లి రాజేష్ మాట్లాడుతూ మాజీ మంత్రి ప్రస్తుత‌ ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసరెడ్డి ప్రతి ఎన్నికల్లోనూ ఒంగోలు నగరానికి ప్రతి రోజూ మంచి నీరు అని హామీ ఇస్తూ గెలిపించిన తరువాత ఆ హామీ లను మరుస్తూ ఉన్నారని గత ప్రభుత్వం 130 కోట్ల రూపాయల తో గుండ్లకమ్మ నుంచి ఒంగోలు కు భారీ పైప్ లైన్లు వేసింది ఆ ప్రాజెక్టు నిర్మాణం ఇంత వరకు ఎందుకు ప్రారంభం చేయలేదో ప్రజలకు సమాధానం చెప్పాలి అని డిమాండ్ చేశారు. ఈకార్యక్రమంలో ఒంగోలు నగర కమిటీ సభ్యులు దండే అనీల్,గోలకారం మనోజ్,వేంపా నరేంద్ర, నవీన్,తోట శబరినాధ్,షేక్ సుభాని, షేక్ నజీర్,పోకల హనుమంతరావు, పల్లా ప్రమీల, గోవింద్ కోమలి, తన్నీరు ఉష, ఆకుపాటి ఉష మరియు డివిజన్ అధ్యక్షులు మాల్యాద్రి నాయుడు, ముత్యాల బాస్కరరావు, పోకల నరేంద్ర, అనీల్,వీరమహిళ కోసూరి శిరీష, జనసైనికులు సాయి, మణికంఠ, కోటి, నవీన్, గోపాల్, శ్రీహరి, కృష్ణబాబు, సుబ్బారావు తదితరులు పాల్గొన్నారు.