ఉపాధి కూలీలు గ్రామ సచివాలయం ఎదుట ఆందోళన*


జగ్గంపేట మండలం వెంగయమ్మపురం
గ్రామంలో ఉపాధి హామీ పథకంలో దొంగ మాస్తర్లు, అవకతవకలపై ఉపాధి కూలీలు గ్రామ సచివాలయం ఎదుట ఆందోళన*


కాకినాడ జిల్లా జగ్గంపేట మండలం
వెంగయమ్మపురం గ్రామంలో  ఉపాధి హామీ పథకం పనుల్లో అవకతవకలు జరుగుతున్నాయని గ్రామస్తులు స్థానిక సచివాలయం ఎదుట తట్ట,బుట్ట, పార,గునపం చేతపట్టుకొని ఆందోళన నిర్వహించారు. గ్రామంలో వారం రోజులు పనులకు వెళ్తే కేవలం మూడు రోజులు మాత్రమే మస్తరు పడుతుందని, మాస్తరు సీట్లు కూడా మాకు ఇవ్వకుండా మాతో వేలిముద్రలు వేయించుకో కుండా మా కష్టాన్ని దోచుకుంటున్నారని ఆందోళన వ్యక్తం చేశారు.


అదేవిధంగా పనిలోకి కాకుండా ఇంటి వద్ద ఉన్న వారికి 1500 రూపాయలు దొంగ మాస్తర్లువేసి ఉపాధిహామీ సిబ్బంది, కొంతమంది ఇతర వ్యక్తులు వారితో కుమ్మక్కై సగం,సగం డబ్బులను పంచుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. వీరికి జనసేన పార్టీ జగ్గంపేట నియోజకవర్గ ఇన్చార్జి పాఠం శెట్టి సూర్యచంద్ర మద్దతు ప్రకటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఉపాధిహామీ అవకతవకలు నిగ్గు తేల్చి, బాధితులకు న్యాయం చేసే వరకు ఆందోళన విరమించేది లేదని సూర్య చంద్ర ధర్నాకు దిగారు....