30-05-2022 న , *రాష్ట్ర "మంత్రి జోగి రమేష్ ఇలాకా" పెడనలో గత 2నెలలుగా జరుగుతున్న అక్రమ మట్టి తవ్వకాలకు అడ్డుకట్ట వేసిన జనసేన నాయకులు జనసైనికులు....*
గత రెండు నెలలుగా నియోజకవర్గం గూడూరు మండలంలో జరుగుతున్న అక్రమ తవ్వకాలను జనసైనికులు నాయకులు పసిగట్టి లోకల్ ఆఫీసర్స్ కి కంప్లైంట్ చేసినా స్పందించకపోవటంతో ఈరోజు ఆ తవ్వకాల ఫోటోలు, వీడియో లతో సహా యీరోజు కలెక్టర్ గారికి ఆధారాలు చూపి రిపోర్ట్ చెయ్యటం జరిగింది,, తక్షణమే చర్యలు తీసుకోవాలని నినాదాలు చేయటం వలన, ఆ ప్రూఫ్ లు చూసి నివ్వెర పోయిన కలెక్టర్ గారు వెను వెంటనే స్పందించి నిజ నిర్ధారణ చేసుకుని ఆ మండల అయిదుగురు vro లను సస్పెండ్ చేయమని ఉత్తరువులకు ఆదేశాలిస్తూనే , RDO గారినీ తవ్వకాలు జరిగిన ప్రాంతాలు చూసి సాయంత్రానికి రిపోర్ట్ చెయ్యమని. ఆదేశించడం జరిగింది.
వెంటనే RDO, MRO, VRO,లను SURVEYORS తో సహా తీసుకువెళ్ళి అక్రమ తవ్వకాలు జరిగిన ప్రదేశాలు చూపించటం జరిగింది. ఇకపై ఎటువంటి తవకలు జరపకుండా చర్యలు తీసుకుంటాం అని RDO గారు హామీ ఇస్తూ స్థానిక రెవెన్యూ అధికారులను అప్రమత్తం గా వుండాలని ఆదేశించారు. మండల ప్రజలు, రైతులు జనసేన పార్టీ కి కృతజ్ఞతలు తెలిపారు...ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి లు బత్తిన హరిరాం, రమాదేవి, జనసైనికులు వెంకన్న,నవీన్ కృష్ణా,హరీష్, రాజు, సాయిరామ్ సంతోష్, అయ్యప్ప, రామకృష్ణా, గణపతి కాశీ పాల్గొనటం జరిగింది....