‘కంటెంట్‌ ఉన్నోడికి కటౌట్‌ చాలు’


ఓటీటీ ప్లాట్‌ఫామ్‌ డిస్నీ+హాట్‌స్టార్‌లో
మార్చి 24 నుంచి స్ట్రీమింగ్‌ మొదలైన భీమ్లానాయక్‌ ఇప్పటికే రికార్డులు బద్దలుకొడుతుంది. ఇక ఈ విఏజెన్నీ పురుస్కరించుకుని డిస్నీ+హాట్‌స్టార్‌తో కలిసి పవర్‌స్టార్‌ అభిమానులు ఓ వినూత్నమైన ఎలివేషన్‌ కార్యక్రమాన్ని హైదరాబాద్‌లోని నెక్లెస్‌రోడ్‌లో ఏర్పాటుచేశారు.

కంటెంట్‌ ఉన్నోడికి కటౌట్‌ చాలు’ అని ‘గబ్బర్‌ సింగ్‌’లో చెప్పినట్లుగా ‘భీమ్లానాయక్‌’ సినిమాలో ఏ విధంగా అయితే పవన్‌ కళ్యాణ్‌ జీపుపై కూర్చుంటాడో అదే తరహాలో జీపుపై పవన్ కూర్చున్న కటౌట్ ని ఆవిష్కరించారు. 

ఓ క్రేన్‌ కు వేలాడదీసిన ఈ జీపు నెక్లెస్‌ రోడ్‌లో అన్ని వైపులా కనిపించేలా చేయడంతో పాటుగా పవన్‌ కళ్యాణ్‌ సినిమాల్లోని పాటలతో వీక్షకులలో ఆసక్తిని రేకిత్తించారు. ఓ సినిమా ప్రమోషన్‌ కోసం ఈ రేంజ్ లో ఎలివేషన్‌ చేయడం ఇదే తొలిసారి కావడం విశేషం. ఇక దీంతో ఈ కటౌట్ వద్ద పవన్ అభిమానులు సందడి చేశారు. పవన్ మాస్కులు ధరించి కటౌట్ తో సెల్ఫీలు దిగుతూ ఎంజాయ్ చేస్తున్నారు.