విజయవాడలో థియేటర్ ధ్వంసం..


దేశ వ్యాప్తంగా అందరూ ఎదురు చూసిన
‘ఆర్ఆర్ఆర్’ సినిమా నిన్న రిలీజ్ అయింది. అభిమానులు దాదాపు మూడు సంవత్సరాలుగా తమ హీరోలని తెరపైన చూడలేదు. దీంతో ఎంతో ఆశగా థియేటర్ కి వెళ్లారు. 

అయితే విజయవాడలోని అన్నపూర్ణ థియేటర్‌లో ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ చిత్రప్రదర్శన సమయంలో సాంకేతిక లోపం తలెత్తి సినిమా ఆగిపోయింది. దీంతో ఎన్టీఆర్, చరణ్ ఫ్యాన్స్ ఆగ్రహం వ్యక్తం చేశారు. తమ ఆగ్రహాన్ని థియేటర్ పై చూపించారు. 

థియేటర్లోని కుర్చీలు, బయట ఫర్నిచర్, థియేటర్ అద్దాలు పగలగొట్టారు అభిమానులు. దీంతో థియేటర్ యాజమాన్యానికి తీవ్ర నష్టం వాటిల్లింది. ఈ ఘటన తెలుసుకున్న పోలీసులు వచ్చి థియేటర్ ని పరిశీలించి, కేసు నమోదు చేసి విచారణ చేపడుతున్నారు.