ఇది ఆవిర్భావ సభగా చూడటంలేదురాష్ట్ర భవిష్యత్తుకోసం జనసేన పార్టీ దిశా నిర్దేశం చెయ్యబోతోంది…గడిచిన రెండున్నర ఏళ్లలో రాష్ట్రంలో ఏమేం జరిగింది, ప్రజలు ఏఏ కష్టాలు పడ్డారు.. ఎలాంటి ఉపద్రవాలు ఎదుర్కోన్నారు. భవిష్యత్తు ఎలా ఉండబోతోంది.
భావితరాలకు ఎలాంటి భరోసా కల్పిస్తే ఎలాంటి భవిశష్యత్తును ఇవ్వగలం” ఈ అంశాలపై జనసేన పార్టీ ఒక బలమైన దిశానిర్దేశం చేసే ఆవిర్భావ దినోత్సవం ఇది అని ఆయన అన్నారు.ఆవిర్బావ దినోత్సవానికి వచ్చే వారిని ప్రభుత్వ పరంగా ఇబ్బందులు కలుగ చేసే అవకాశం ఉంటుందని ఆయన తెలిపారు. అడ్డంకులు కల్పించినా వారికి చెప్పండి “
ఇది మా హక్కు” అని… మీరు ఇబ్బంది పడాల్సిన పనిలేదు,.మీరు భయపడాల్సిన పనిలేదు మన ఆవిర్భానవ దినోత్సవం మన హక్కు అని పవన్ కళ్యాణ అన్నారు. అలాగే పోలీసు శాఖ వారికి మనస్పూర్తిగా విన్నవిస్తున్నాము. మాకు సహకరించండి అని పోలీసు వారికి విజ్ఞప్తి చేశారు.ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర క్షేమాన్ని ఆకాంక్షించే వారి అందరికీ ఆహ్వానం పలుకుతున్నానని ఆయన తెలిపారు. మహిళల కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేశామని కార్యక్రమానికి వచ్చేవారెవ్వరూ ఇబ్బంది పడకుండా ఉండేలా ఏర్పాట్లు చేసినట్లు పవన్ కళ్యాణ్ చెప్పారు. క్షేమంగా వచ్చి క్షేమంగా వెళ్ళండని ఆయన అందరినీ కోరారు