వైద్యుడు కానీ వ్యక్తి రోగులకు వైద్యం


ప్రభుత్వ ఆస్పత్రిలో ఆడియో మెట్రిక్‌ టెక్నీషి యన్‌గా విధులు నిర్వహిస్తున్న కిరణ్‌ ఓపీ గదుల్లో రోగులను పరీక్షించి, మం దులు రాసిచ్చాడు. ఈయన వినికిడి పరీక్షలు నిర్వహించే నిపుణుడు మాత్రమే. అయినా, డాక్టర్‌ తరహాలో రోగులకు వైద్య సేవలు అందిస్తున్నారు. 

ప్రభుత్వ ఆస్పత్రిలో వైద్యుల పక్కనే కూర్చుని వైద్యం చేయడం గమనార్హం. ఈ విష యంపై ఆస్పత్రి సూపరింటెండెంట్‌ పద్మలతను వివరణ కోరగా, అతనికి వైద్యం చేయమని తానే చెప్పానని అన్నారు. ఆడియో మెట్రిక్‌ టెక్నీషియన్‌కు అవసరమైన యంత్రాలు ఆస్పత్రిలో లేవని తెలిపారు. ‘అతనిని  ఊరికే కూర్చో బెట్టి జీతాలు ఇవ్వలేంకదా.. అందుకే ఓపీలో రోగులకు వైద్యం చేయమని చెప్పాం..’ అని అన్నారు.