విశాఖపట్నం ఫిబ్రవరి 3:- మహా విశాఖపట్నం నగర పాలక సంస్థ మేయర్ గోలగాని హరి వెంకట కుమారిని ట్రైనీ కలెక్టర్ అతిథి సింగ్ గురువారం జీవీఎంసీ ప్రధాన కార్యాలయంలోని ఆమె చాంబర్లో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా నగర మేయర్ జీవీఎంసీ లో జరుగుచున్న పలు అభివృద్ధి పనులను ఆమెకు వివరించారు. జీవీఎంసీ పరిధి, నగర జనాభా, జీవీఎంసీ లో ప్రభుత్వ ఉద్యోగులు, ప్రైవేటు ఉద్యోగులు సంఖ్య,, జివిఎంసికి వివిధ రూపంలో వచ్చే రాబడి ఖర్చులు వివరాలను, నగరంలో పారిశుద్ధ్య నిర్వహణ, త్రాగునీరు, రోడ్లు కాలువల నిర్మాణం, విద్య, వైద్య, వీధి దీపాల నిర్వహణ పార్కుల అభివృద్ధి, రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న నవరత్నాలు లాంటి పలు సంక్షేమ పథకాలు ప్రజలకు చేరువ చేయడం, నగరంలో విపత్తులు జరిగినప్పుడు ప్రజలకు కమాండ్ కంట్రోల్ సెంటర్ ద్వారా తెలియపరచడం, కాపులుప్పాడ లోని జిందాల్ కంపెనీ చెత్త నుండి విద్యుత్ తయారు చేయు విధానము, మల్టీ లెవల్ కార్ పార్కింగ్ లాంటి పలు ప్రాజెక్టులను ట్రైనీ కలెక్టర్ కు మెయిల్ వివరించారు.వి