ఎనిమిదేళ్లు అన్యోన్యంగా కాపురం..భార్య ఆచూకి మిస్సింగ్..


ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. ఎనిమిదేళ్ల నుంచి వారి వైవాహిక బంధం బాగానే సాగుతుంది. తాజాగా భర్త.. తన  ఈ ఫోటోలోని వ్యక్తి.. ఆ పక్కనే ఉన్న మహిళను ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. వీరి వైవాహిక బంధం బాగానే ముందకు వెళ్తోంది. కానీ అనూహ్యంగా ఒకరోజు అతడి భార్య కనిపించకుండా పోయింది. దీంతో అన్ని చోట్లా వెతికి ఫలితం లేకపోవడంతో.. పోలీసులకు ఫిర్యాదు చేశాడు. అప్పుడు అసలు బాగోతం వెలుగుచూసింది. వివరాల్లోకి వెళ్తే.. విజయనగరం జిల్లా జోడిమెరకు చెందిన జోడి నాగరాజు.. శ్రీకాకుళం జిల్లా రాజంకు చెందిన లక్ష్మీ(28)ని ఎనిమిదేళ్ల క్రితం ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. ఈ దంపతులకు ఒక కుమారుడు జన్మించాడు. 

అయితే అనూహ్యంగా గత నెల 30వ తేదీ నుంచి తన భార్య లక్ష్మీ కనిపించటం లేదని నాగరాజు.. పోలీసులకు కంప్లైంట్ చేశాడు. తమది ప్రేమ వివాహం అని.. ఆచూకీ తెలపాలంటూ పోలీసు స్టేషన్ చుట్టూ తిరిగి.. పోలీసులను మిస్ లీడ్ చేశాడు. పోలీసులు అతడిని జన్యూన్ అనే అనుకున్నారు. అయితే నాగరాజు ప్రవర్తనపై స్థానికులకు కాస్త తేడా కొట్టింది. మరో మహిళతో నాగరాజుకు సన్నిహిత సంబంధం ఉన్న విషయాన్ని కనిపెట్టి.. పోలీసులకు సమాచారమిచ్చారు. 

నాగరాజును అదుపులోకి తీసుకుని ప్రశ్నించగా.. భార్యను హత్య చేసినట్లు అంగీకరించాడని పోలీసులు తెలిపారు. హత్యలో ఇంకా ఎవరి పాత్ర అయినా ఉందా? అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. నాగరాజే భార్యను హత్య చేశాడని తెలియగానే జోడిమెరకలో ఉద్రిక్త పరిస్థితులు తలెత్తాయి. నిందితుడిని కఠినంగా శిక్షించాలంటూ మహిళలు ర్యాలీ నిర్వహించారు.భార్య కనిపించటం లేదని పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కానీ పోలీసుల దర్యాప్తులో అసలు నిజం వెల్లడైంది.