'హరిహర వీరమల్లు':యాక్షన్ రీస్టార్ట్..!


 హరిహర వీరమల్లు' చిత్రం భారీ యాక్షన్ సీక్వెన్స్‌తో రీస్టార్ట్ కాబోతుందని తాజా సమాచారం. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా నటిస్తున్న లేటెస్ట్ పాన్ ఇండియన్ చిత్రమిది. ఈ భారీ చిత్రానికి దర్శకుడు క్రిష్ జాగర్ల మూడి కాగా, ప్రముఖ నిర్మాత ఏ ఎం రత్నం మెగా సూర్య ప్రొడక్షన్స్ పతాకంపై భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా చిత్రీకరణ 50 శాతం పూర్తైనట్టు వార్తలు వచ్చాయి. 

ఇక కరోనా వేవ్స్ కారణంగా నిలిచిపోయిన చిత్రీకరణ తిరిగి త్వరలో ప్రారంభించబోతున్నారు. ఈ నేపథ్యంలో ఓ భారీ యాక్షన్ సీక్వెన్స్‌తో షూటింగ్ రీ స్టార్ట్ చేసేలా ప్లాన్ చేశారట. దీనికి సంబంధించి తాజాగా హీరో పవన్ కళ్యాణ్‌తో స్క్రిప్ట్ డిస్కర్షన్ చేసినట్టు తెలుస్తోంది. దీనికి సబంధించిన పిక్ కూడా ఒకటి ప్రస్తుతం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఇందులో హీరోయిన్‌గా నిధి అగర్వాల్, కీలక పాత్రల్లో బాలీవుడ్ స్టార్ నర్గీస్ ఫక్రీ, అర్జున్ రాంపాల్ కనిపించబోతున్నారు. ఎం ఎం కీరవాణి సంగీత దర్శకుడు.