అంబేద్కర్ మహా శిల్పి స్మృతి వనం పై దాడికి నిరసనగా అంబేద్కర్ విగ్రహానికి పాలాభిషేకం వైయస్సార్సీపి జిల్లా ఎస్సీ సెల్ అధ్యక్షురాలు సర్పంచ్ లోచల సుజాత

 అనకాపల్లి జిల్లా నర్సీపట్నం నియోజకవర్గం గొలుగొండ మండలం ఏ.యల్.పురం మేజర్ పంచాయతీలో జిల్లా ఎస్సీ సెల్ అధ్యక్షురాలు శ్రీమతి లోచల సుజాత


ఆధ్వర్యంలో విజయవాడలో జరిగిన డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ మహా శిల్ప స్మృతి వనం పై దాడిని ఖండిస్తూ గ్రామంలో అంబేద్కర్ విగ్రహానికి పాలాభిషేకం చేసి నల్ల బ్యాడ్జీలుతో నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ గత ప్రభుత్వంలో మాజీ ముఖ్యమంత్రి వర్యులు గౌరవనీయులు శ్రీ వై.యస్.జగన్మోహన్ రెడ్డి గారు భారత రాజ్యాంగ నిర్మాత బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి అయినటువంటి డా,,బి.ఆర్ అంబేద్కర్ గారి ఖ్యాతిని ప్రపంచానికి చాటి చెప్పాలని విజయవాడ నడిబొడ్డులో నిర్మించినటువంటి మహా శిల్ప స్మృతి వనముపై దాడి చేయడం ప్రజాస్వామ్యంపై దాడి చేయడమేనని దీనిని హేయమైన చర్యగా భావిస్తూ తీవ్రంగా ఖండిస్తున్నామని అలాగే దాడి చేసిన వారిని వెంటనే అరెస్ట్ చేసి ఇలాంటి చర్యలు మరలా పునరావృతం కాకుండా చూడాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఎస్సీ సామాజిక వర్గ వైయస్సార్సీపి కార్యకర్తలు అంబేద్కర్ యూత్ సభ్యులుపాల్గొన్నారు.