గంజాయి అక్రమ రవాణాకు పాల్పడిన కేసుల్లో తప్పించుకుని తిరుగుతున్న నిందితులను అరెస్టులు చేయాలి: జిల్లా ఎస్పీ శ్రీమతి ఎం.దీపిక ఐపీఎస్.,
రాత్రీ, పగలు గస్తీ లలో బ్యాంక్ లు ఏ.టీ.ఎం పటిష్ట తనిఖీలు నిర్వహించాలి: జిల్లా ఎస్పీ
అనకాపల్లి, జూలై 31:* జిల్లా పోలీస్ కార్యాలయంలో ఎస్పీ శ్రీమతి ఎం.దీపిక ఐపీఎస్ గారు నెలవారీ నేర సమీక్ష సమావేశం నిర్వహించి, దర్యాప్తులో ఉన్న సాధారణ, తీవ్రమైన మరియు ముఖ్యమైన కేసులు, ప్రాపర్టీ కేసులు, 174 సీఆర్పీసీ కేసులు, గంజాయి కేసులు మరియు మిస్సింగ్ కేసులను పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా సమీక్షించి ఆయా కేసుల్లో దర్యాప్తు పెండింగ్ లో ఉండడానికి గల కారణాలను సంబంధిత అధికారుల నుండి తెలుసుకొని త్వరితగతిన దర్యాప్తు చేయుటకు పలు సూచనలు చేశారు.
గంజాయి అక్రమ రవాణా జరిగే ఆంధ్ర, ఒడిస్సా సరిహద్దు జిల్లాల నుండి మరియు ఏజెన్సీ ప్రాంతం వైపు నుండి వివిధ మార్గాల్లో గంజాయి అక్రమ రవాణాను గుర్తించడం, ఇంటిలిజెన్స్ సమాచారాన్ని సేకరించి ఆకస్మిక, డైనమిక్ వాహన తనిఖీలు నిర్వహించాలన్నారు. ఫార్వర్డ్, బ్యాక్ వర్డ్ లింకులను గుర్తించి, గంజాయి అక్రమ రవాణా కేసుల్లో తప్పించుకుని తిరుగుతున్న నిందితులను అరెస్టులు చేయాలన్నారు. గంజాయి అక్రమ రవాణా కేసుల్లో పోలీస్ సిబ్బంది పాత్ర ఉన్నట్లు విచారణలో వెల్లడైతే ఎంతటి వారైనా కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.
మహిళలు, బాలికల పై జరిగే నేరాలు పట్ల పోలీస్ అధికారులు ప్రత్యేక చొరవ తీసుకుని, దర్యాప్తును సమగ్రంగా నిర్వహించి గౌరవ కోర్టులో శిక్షలు పడే విధంగా పటిష్ట చర్యలు చేపట్టాలన్నారు.
నేరాలు నియంత్రించేందుకు పగలు, రాత్రి గస్తీలను ముమ్మరం చేయాలని బ్యాంకులు, ఏటీఎంలు వద్ద తనిఖీలు నిర్వహించాలన్నారు. పాత నేరస్థుల పై నిఘా ఏర్పాటు చేయాలన్నారు. ప్రజలకు నేరాలు పట్ల మరియు సైబర్ క్రైమ్స్ పట్ల అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలన్నారు.
రోడ్డు ప్రమాదాల నివారణకు విజిబుల్ పోలీసింగ్ నిర్వహిస్తూ, ఎన్ఫోర్స్మెంట్ కేసులు ఎక్కువ నమోదు చేయాలన్నారు. ప్రజలకు రోడ్డు భద్రతా నియమాల పట్ల అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలన్నారు.
ఈ నేర సమీక్ష సమావేశంలో ప్రతిభ కనబరిచిన 15 మంది పోలీసు అధికారులు, సిబ్బందికి ప్రశంసా పత్రాలు అందజేశారు.
ఆత్మీయ వీడ్కోలు సన్మాన కార్యక్రమం* ఆర్మ్డ్ రిజర్వ్ ఏఆర్ఎస్సై
టి.సత్యనారాయణ రాజు గారికి జిల్లా ఎస్పీ శ్రీమతి ఎం.దీపిక ఐపీఎస్., గారు
ఘనంగా సన్మానించి జ్ఞాపికలు అందజేశారు.
ఈ కార్యక్రమంలో అదనపు ఎస్పీలు శ్రీ బి.విజయ భాస్కర్, ఎస్.బి డీఎస్పీ శ్రీ బి.అప్పారావు, పరవాడ సబ్ డివిజన్ డీఎస్పీ శ్రీ కె.వి.సత్యనారాయణ, దిశా డీఎస్పీ శ్రీ ఎం.ఉపేంద్ర బాబు, ఏ.ఆర్ డీఎస్పీ శ్రీ పి.నాగేశ్వరరావు
ఇనస్పెక్టర్ లు లక్ష్మణమూర్తి, చంద్రశేఖర్, అప్పలనాయుడు, గణేష్, సతీష్, మన్మధరావు, నరసింహమూర్తి మరియు సంజీవరావు, ఎస్సైలు రామారావు, రఘువర్మ, జిల్లా సీఐలు, ఎస్సైలు, సిబ్బంది పాల్గొన్నారు.
*జిల్లా పోలీసు కార్యాలయము,*
*అనకాపల్లి.*