గొలుగొండ మండలం ఎర్రవరం రాజుల బాబు గుడి వద్ద భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ మండల కార్యవర్గ సమితి సమావేశం నిర్వహించారు
ఈ సమావేశంలో సిపిఐజిల్లా కార్యదర్శి బాలేపల్లి వెంకటరమణ మాట్లాడుతూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు గత పది సంవత్సరాలు పాటు రాజకీయ బానిస కోసం దేశ సంపదలను తాకట్టు పెట్టడం విచ్చలవిడిగా అమ్మడం ప్రజా పరిపాలన ఆటగా మార్చుకోవడం యువతకు ప్రజా సంక్షేమం కోసం ప్రభుత్వ పరిశ్రమలు పెట్టకుండా వాటి నుండి వచ్చే లాభాలను ఉపయోగించకుండా ప్రైవేట్ కార్పొరేట్ చేతులు కలిపి బ్యాంకులు, ప్రజల ఆస్తులు ద్వారా లబ్ధి చేకూర్చి రుణమాఫీలు చేసి వారిని తప్పిస్తున్నారు.... దేశ రాష్ట్ర పరిస్థితులు అప్పులతో కూరుకుపోయి. ప్రజలపై అనేక భారాలు మోపుతున్నారు.రానున్న రోజులకి మరింత భారం పెరిగేలా ఉందని యువత మేధావులు ప్రజలు గమనించగలరని పిలుపునిచ్చారు
గత రాష్ట్ర ప్రభుత్వంలో నిజమైన లబ్ధిదారులకు అందని ద్రాక్షలా పెట్టిన పథకాలు పూర్తిస్థాయిలో చేకూరలేదు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకు భూ సంరక్షణ పథకంలో అనేక భూ సమస్యలు అవకతవకలు జరిగాయ పార్టీలు,వర్గాలు చూడకుండా నేరుగా అందిస్తామన్న జగన్ ప్రభుత్వాని ప్రజా ఓటర్లు గద్దె దింపారు అన్నారు
ప్రధాని నరేంద్ర మోడీ రాష్ట్ర ఆర్థిక పరిస్థితులు ఇప్పటికైనా తెలుసుకొని ప్రత్యేక హోదా, విభజన హామీ చట్టాలను నెరవేర్చాలని అన్నారు
గత ప్రభుత్వ శాఖల బడ్జెట్ పక్కదారి పట్టించకుండా ఆర్థిక పరిపాలన దృష్టిలో పెట్టికొని అన్ని శాఖలు బడ్జెట్ కేటాయించి పంచాయతీ నిధులు విడుదల చేసి సమగ్రమైన పరిపాలన కోసం ప్రస్తుత హామీలను నేటి ప్రభుత్వం కృషి చేయాలని అన్నారు
ఈ కార్యక్రమంలో సిపిఐ జిల్లా సహాయ కార్యదర్శి మాకిరెడ్డి రామునాయుడు సిపిఐ జిల్లా ప్రజా సంఘ నాయకులు జిగురు బాబు,మేకా సత్యనారాయణ, శివలంక కొండలరావు, మేకాభాస్కరరావు,జి.రాధాకృష్ణ మండల కార్యవర్గ సమితి సభ్యులు తదితరులు పాల్గొన్నారు