సార్వత్రిక ఎన్నికల కౌంటింగ్ సందర్బంగా కౌంటింగ్ కేంద్రం వద్ద పటిష్ట భద్రత జిల్లా ఎస్పీ కే.వీ.మురళీకృష్ణ

 అనకాపల్లి జిల్లా పోలీసు


సార్వత్రిక ఎన్నికల కౌంటింగ్ సందర్బంగా కౌంటింగ్ కేంద్రం వద్ద పటిష్ట భద్రత



 విధుల్లో ఉన్న పోలీస్ ఆఫీసర్లు మరియు సిబ్బంది అప్రమత్తంగా ఉండి వారికి నిర్దేశించిన డ్యూటీ ని సమర్థవంతంగా చేయాలి


పోలీస్ ఆఫీసర్స్ మరియు సిబ్బందికి దిశా నిర్దేశం చేసిన జిల్లా ఎస్పీ శ్రీ కె.వి.మురళీకృష్ణ ఐపీఎస్


అనకాపల్లి, జూన్ 2: ఈ నెల 4 న సార్వత్రిక ఎన్నికల కౌంటింగ్ జరగనున్న నేపథ్యంలో బందోబస్తు విధులు నిర్వహించే అధికారులు మరియు సిబ్బందికి జిల్లా ఎస్పీ శ్రీ కె.వి.మురళీకృష్ణ ఐపీఎస్., గారు జిల్లా పోలీస్ కార్యాలయంలో దిశా నిర్దేశం చేశారు. ఈ సంధర్బంగా జిల్లా ఎస్పీ గారు మాట్లాడుతూ కౌంటింగ్ కేంద్రం వద్ద పటిష్ట భద్రతా ఏర్పాట్లు చేయడం జరిగిందన్నారు.


కౌంటింగ్ కేంద్రానికి రెండు కిలోమీటర్ల పరిధిలో బందోబస్తు విధులు నిర్వహించే పోలీస్ అధికారులకు మరియు సిబ్బందికి ప్రతి పాయింట్ ని పర్యవేక్షించి, ఎన్నికల ఫలితాల రోజు ఎన్నికల అభ్యర్థులను, కౌంటింగ్ ఏజెంట్లను, కౌంటింగ్ ఎంప్లాయిస్ ను ఏ రూట్ లలో కౌంటింగ్ కేంద్రానికి పంపించాలి, ఎక్కడ వారికి సంబంధించిన వాహనాలను పార్టీ చేసుకోవాలి, ట్రాఫిక్ ను ఏ విధంగా రెగ్యులేట్ చేసుకోవాలి, మొదలగు విధుల గురించి, అనుమతి లేని ప్రజలను గుమి కూడకుండా తీసుకోవలసిన జాగ్రత్తల గురించి పాయింట్ బ్రీఫింగ్ ఇవ్వడం జరిగింది.


బందోబస్తు విధుల్లో ఉన్న జిల్లా పోలీసులతో పాటు కేంద్ర సాయుధ పోలీస్ బలగాలు, ఏ.పి.ఎస్.పి బలగాలు నిరంతరం అప్రమత్తంగా ఉంటూ విధులు నిర్వర్తించాలని ఆదేశించారు. పోలీస్ అధికారులు, సిబ్బందితో ఏర్పాటు చేసిన క్విక్ రెస్పాన్స్ టీమ్ (క్యూ.ఆర్.టి) లు సిద్ధంగా ఉంటాయని, ఎలాంటి ఘటన గురించి సమాచారం వచ్చిన వెంటనే క్షణాల్లో ఘటనా స్థలానికి చేరుకుంటారని ఎస్పీ తెలిపారు. సమావేశం అనంతరం కౌంటింగ్ కేంద్రానికి వెళ్లే రహదారిపై అభ్యర్థులు, కౌంటింగ్ ఏజెంట్లను అనుమతించే దారులను, ఏర్పాటు చేసిన చెక్ పోస్టులను పరిశీలించి పోలీస్ అధికారులకు పలు సూచనలు చేశారు.

  

ఈ కార్యక్రమంలో అదనపు ఎస్పీలు శ్రీ బి.విజయ భాస్కర్, సత్యనారాయణ, అనకాపల్లి సబ్ డివిజన్ డీఎస్పీ శ్రీ ఎస్.అప్పలరాజు, పరవాడ సబ్ డివిజన్ డీఎస్పీశ్రీ కె.వి.సత్యనారాయణ, నర్సీపట్నం సబ్ డివిజన్ డీఎస్పీ శ్రీ జి.ఆర్.ఆర్.మోహన్, ఎస్.బి డీఎస్పీ శ్రీ బి.అప్పారావు, ఏ.ఆర్ డీఎస్పీ శ్రీ పి.నాగేశ్వరరావు, ఇనస్పెక్టర్ లు లక్ష్మణమూర్తి, చంద్రశేఖర్, అప్పలనాయుడు మరియు కుమారస్వామి, సతీష్, ఎస్సైలు రామారావు, శ్రీనివాస్, రఘువర్మ మరియు జిల్లాలోని ఇతర సీఐలు, ఎస్సైలు, సిబ్బంది పాల్గొన్నారు.


జిల్లా పోలీసు కార్యాలయం,

అనకాపల్లి