ఏపీలో మరో 9 లోక్‌సభ స్థానాలకు అభ్యర్థులను ప్రకటించిన కాంగ్రెస్.. జాబితా ఇదే..

   


  9tvdigital ఆధ్రప్రదేశ్‌లో లోక్‌సభ ఎన్నికలకు సంబంధించి కాంగ్రెస్ పార్టీ మరో జాబితాను విడుదల చేసింది. ఈ జాబితాలో 9 మంది అభ్యర్థుల పేర్లను ప్రకటించింది. ఆ జాబితాను పరిశీలిస్తే శ్రీకాకుళం నుంచి పరమేశ్వరరావు, విజయనగరం నుంచి బొబ్బిలి శ్రీను, అమలాపురం నుంచి జంగా గౌతమ్, మచిలీపట్నం నుంచి గొల్లు కృష్ణ, విజయవాడ నుంచి వల్లూరు భార్గవ్, ఒంగోలు నుంచి ఈడ సుధాకర్ రెడ్డి, నంద్యాల నుంచి లక్ష్మీ నర్సింహ యాదవ్, హిందూపురం నుంచి సమద్ షాహీన్, అనంతపురం నుంచి మల్లికార్జున్‌లను బరిలో నిలపనున్నట్టుగా తెలిపింది.ఇక, ఏపీలో కాంగ్రెస్ పార్టీ గతంలో రెండు జాబితాలలో 11 లోక్‌సభ, 126 అసెంబ్లీ స్థానాలకు అభ్యర్థులను ప్రకటించిన సంగతి తెలిసిందే. ఇప్పుడు మరో 9 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించడంతో.. ఏపీలోని మొత్తం 25 స్థానాల్లో 20 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించినట్టు అయింది. 


ఏపీలో కాంగ్రెస్ లోక్‌సభ అభ్యర్థులు.. 

కడప - వైఎస్ షర్మిల

శ్రీకాకుళం- పరమేశ్వరరావు, 

విజయనగరం - బొబ్బిలి శ్రీను, 

అమలాపురం - జంగా గౌతమ్, 

మచిలీపట్నం - గొల్లు కృష్ణ, 

విజయవాడ - వల్లూరు భార్గవ్, 

ఒంగోలు - ఈడ సుధాకర్ రెడ్డి, 

నంద్యాల - లక్ష్మీ నర్సింహ యాదవ్,

హిందూపురం - సమద్ షాహీన్, 

అనంతపురం - మల్లికార్జున్‌

విశాఖపట్నం - పులుసు సత్యనారాయణరెడ్డి, 

అనకాపల్లి - వేగి వెంకటేష్, 

ఏలూరు - లావణ్య కావూరి, 

నరసరావుపేట - గర్నెపూడి సుధాకర్, 

నెల్లూరు - కొప్పుల రాజు,

తిరుపతి (ఎస్సీ) - డాక్టర్ చింతా మోహన్‌

కాకినాడ - ఎంఎం పల్లంరాజు

రాజమండ్రి - గిడుగు రుద్రరాజు

బాపట్ల (ఎస్సీ) - జేడీ శీలం

కర్నూలు - పీజీ రామపుల్లయ్య యాదవ్