రామోజీరావు కి యూజేఎఫ్ నివాళి యూజేఎఫ్ అధ్యక్షుడు2024-25 హ్యాండ్ బుక్ ను ఆవిష్కరించిన డాక్టర్ ఎం ఆర్ ఎన్ వర్మ

*రామోజీరావు కి యూజేఎఫ్ నివాళి*

ఉత్తరాంధ్ర జర్నలిస్ట్స్ ఫ్రంట్ 2024-25 హ్యాండ్ బుక్ ను శనివారం నర్సీపట్నం లో ఆవిష్కరించారు. కొయ్యురు, గొలుగొండ, నర్సీపట్నం, మాకవరపుపాలెం, నాతవరం మండల జర్నలిస్ట్ లు పాల్గొన్న ఈ కార్యక్రమం లో ముందుగా ఈనాడు దినపత్రిక అధిపతి మృతికి సంతాపం తెలిపి నివాళులు అర్పించారు. యూజేఎఫ్ అధ్యక్షులు డాక్టర్ ఎం. ఆర్. ఎన్ వర్మ మాట్లాడుతూ తెలుగు జర్నలిజం లో ప్రత్యేక ఒరవడి ని సృష్టించిన ఘనత రామోజీ రావు కి దక్కుతుందన్నారు. ఈనాడు జర్నలిజం స్కూల్ ద్వారా ఎంతోమంది ఉత్తమ జర్నలిస్ట్ లు తయారయ్యాన్నారు. హ్యాండ్ బుక్ లో ఆరు జిల్లాల జర్నలిస్ట్ ల ఫోన్ నంబర్లను, ఉత్తరాంధ్ర విలువైన సమాచారాన్ని పొందుపరచడం జరిగిందన్నారు. జర్నలిస్ట్ ల సహకారం తో యూజేఎఫ్ కార్యక్రమాలను మరింత ముమ్మరం చేస్తామన్నారు.ఈ కార్యక్రమం లో సీనియర్ జర్నలిస్ట్ లు వేణు, వెంకటేశ్వరరావు మాస్టరు శంకర్, సీపీఐ నాయకులు బాలేపల్లి వెంకటరమణ, మాకిరెడ్డి రామా నాయుడు, సూరిబాబు, రాధాకృష్ణ తదితరులు పాల్గొన్నారు.