వేంపాడు మరియు తాండవ చెక్ పోస్ట్ లను జిల్లా కలెక్టర్ రవి పట్టన్ శెట్టి మరియు జిల్లా ఎస్పీ శ్రీ కె.వి.మురళీకృష్ణ

 *అనకాపల్లి జిల్లా పోలీసు*


అకస్మాత్తుగా తనిఖీ చేసిన


వేంపాడు మరియు తాండవ చెక్ పోస్ట్ లను జిల్లా కలెక్టర్ రవి పట్టన్ శెట్టి మరియు జిల్లా ఎస్పీ శ్రీ కె.వి.మురళీకృష్ణ సంయుక్తంగా తనిఖీలు నిర్వహించారు.


నక్కపల్లి మండలం, వేంపాడు టోల్ ప్లాజా వద్ద ఉన్న పోలీస్ చెక్ పోస్ట్, పాయకరావుపేట మండలం, తాండవ పోలీస్ చెక్ పోస్ట్ ను ను అనకాపల్లి జిల్లా కలెక్టర్ మరియు జిల్లా ఎస్పీలు సంయుక్తంగా తనిఖీలు నిర్వహించారు. పోలీస్ సిబ్బందితో మాట్లాడుతూ వాహన తనిఖీలు ముమ్మరం చేయాలని, మద్యం, నాటు సారా, మత్తు పదార్థాలు, అక్రమ రవాణా అరికట్టాలని, డబ్బు, ఉచిత కానుకలు పంపిణీ చేసే వారిపై కఠిన చర్యలు చేపట్టాలని, ఎన్నికల నియమావళిని అమలు చేయడంలో భాగంగా ప్రజలు అప్రమత్తం తో ఉంటూ, సమాచారం తెలి

యజేయాలని, ఎన్నికలు స్వేచ్ఛగా, ప్రశాంత వాతావరణం లో జరిగేందుకు ప్రతి ఒక్కరూ పాలుపంచుకోవాలని ఈ సందర్భంగా తెలిపారు.


ఎస్పీ గారి వెంట నర్సీపట్నం సబ్ డివిజన్ డీఎస్పీ శ్రీ జి.ఆర్.ఆర్.మోహన్, నక్కపల్లి ఎస్.హెచ్.ఓ విజయ్ కుమార్, పాయకరావుపేట ఎస్.హెచ్.ఓ అప్పలరాజు లు పాల్గొన్నారు.


*జిల్లా పోలీసు కార్యాలయం,* *అనకాపల్లి*