మన వాళ్లు కోసం మనం ఆర్గనైజేషన్ ద్వారా సెంట్రింగ్ పనికి వెళ్లి ప్రమాదవశాత్తు గాయపడిన శ్రీహరి కుటుంబానికి 40,000 ఆర్థిక సహాయం చేసిన ఆర్గనైజేషన్ సభ్యులు

 ఏవ్వరూ ఏమైపోతే నాకేంటి నేను నా కుటుంబం బాగున్నాం కదా అని ఆలోచించే ఈ స్వార్థ ప్రపంచంలో మనం పుట్టిన ఊరు మనతో నిత్యం జీవిస్తున్న మన


వాళ్ళకీ మనకీ ఉన్నంతలో ఏదో ఒకటి చేయ్యాలన్న గొప్ప సంకల్పంతో అనకాపల్లి జిల్లా బుచ్చయ్య పేట మండలం విజయరామరాజుపేట గ్రామ అంబేద్కర్ యూత్ ద్వారా ఏర్పడిన మనవాళ్ళకోసం మనం ఆర్గనైజేషన్ ద్వారా ఈ రొజు సెంట్రింగ్ పనికి వెళ్ళి రెండు అంతస్తుల బిల్డింగ్ పైనుంచి పడి వెన్నుపూస విరిగి ఆపరేషన్ జరిగి కొన్ని నెలలు నుండి స్పర్శ కోల్పోయి మంచానికి పరిమితం ఐనా నర్సీపట్నం కి చెందిన శ్రీహరి గారి కుటుంబం ని ఈ రోజు మనవాళ్ళకోసం మనం ఆర్గనైజేషన్ సభ్యులు పరామర్శించి 40,000 వేల రూపాయలు ఆర్ధిక సహాయం చేసి వారికుటుంబం కి కొంత ఆర్ధిక భరోసా కల్పించడం జరిగింది ఈ సందర్బంగా ఆర్గనైజేషన్ కోశాధికారి దొండ రమేష్ మాట్లాడుతూ మావాళ్ల కే సహాయం చేయాలన్న ఆలోచన పెట్టిన ఆర్గనైజేషన్ ఈ రోజ ఎవరో తెలియని అవసరం ఐనా జనాలకి సహాయం చేయడం దిశగా వెళ్తున్న తీరు చాలా అనoదాన్నిఇచ్చిందని బాబా సాహెబ్ అంబేద్కర్ ఆలోచన పే బ్యాక్ టు సొసైటీ ని మా అందరిలో అళోజింప చేసి ఇంతటి కార్యక్రమంల్ని మా అందరితో ప్రోత్సహిస్తూ, అన్నిటికి డైరం చెబుతున్న మా పెద్దన్న అలమండ మహేశ్వరరావు గారికి, ఆర్గనైజేషన్ ని అన్నివిధాలుగా మొన్నట్రింగ్ చేస్తున్న కమిటీ నేతల ప్రసాద్, పలివెల మాలిబాబు గారికి అన్ని సేవా కార్యక్రమంలకి సహాయ సహకారం అందిస్తున్న ఆర్గనైజేషన్ సభ్యులు అందరికి ధన్యవాదములు తెలియజెయసారు ఈ కార్యక్రమం లో మనవాళ్ళ కోసం మనం ఆర్గనైజేషన్ సభ్యులు మరియు సరిసా అశోక్,వీరబాబుగారు, చిట్టీయ్య గారు, సంతోష్ గారు పాల్గొనడం జరిగింది