గొలుగొండ మండలంలో నర్సీపట్నం శాసనసభ్యులు పెట్ల ఉమా శంకర్ గణేష్ వైయస్సార్ ఆసరా కార్యక్రమంలో 1022 గ్రూపులకు 7 కోట్ల 18 లక్షల చెక్కుల పంపిణీ

 


అనకాపల్లి జిల్లా గొలుగొండ మండలంలో ఎంపీపీ మణికుమారి అధ్యక్షతన 1022 డ్వాక్రా సంఘలకు 11 వేల గ్రూపు సభ్యులకు నర్సీపట్నం శాసనసభ్యులు పెట్ల ఉమశంకర్ గణేష్ చేతులమీదుగా 4వ విడత వైయస్సార్ ఆసరాలో భాగంగా రూ.7.కోట్ల 18 లక్షల చెక్కును పంపిణీ చేశారు.


ఈ మేరకు మండల కేంద్రంలో జరిగిన వైయస్సార్ ఆసరా కార్యక్రమంలో ముఖ్యఅతిధిగా అయన పాల్గొన్నారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ గత ప్రభుత్వం డ్వాక్రా మహిళలను మోసం చేసింది. జగనన్న మాత్రం మరిచిపోకుండా మహిళలను ఉన్నత స్థితిలో తీర్చి దిద్దుతున్నారన్నారు.

అందులో భాగంగా ప్రతి ఏటా ఆసరా పథకం ద్వారా డ్వాక్రా మహిళలకు వరాలు కురిపిస్తున్నారన్నారు. అలాగే గత ప్రభుత్వం రైతులను, మహిళలను, నిరుద్యోగులను ,విద్యార్థులను తీవ్ర అన్యాయం చేస్తే, జగనన్న మాత్రం ఏదైతే చెప్పాడో అదే చేసి, ఇచ్చిన మాట నిలబెట్టుకున్నారన్నారు. అందుకే మరొక్కసారి సీఎంగా జగన్మోహన్ రెడ్డినే చూడాలని ఈసందర్బంగా డ్వాక్రా మహిళలను కోరారు. అలాగే ఎంపీపీ గజ్జలపు మాణికుమారి,

జడ్పీటీసీ ఎస్వి గిరిబాబు, మండల పార్టీ అధ్యక్షుడు లెక్కల సత్యనారాయణ వైస్ ఎంపీపీ ఆదినారాయణ, సర్పంచ్ కసిపల్లి అప్పారావు, కార్యక్రమాన్ని ఉద్దేశించి మాట్లాడారు. అనంతరం ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి చిత్ర పటానికి పాలాభిషేకం చేశారు. ఈకార్యక్రమంలో జిల్లా ఎస్సి సెల్ అధ్యక్షులు లోచల సుజాత,వైస్ ఎంపీపీ జక్కు నాగమణి, మండల ప్రధాన కార్యదర్శి పత్తి రమణ కోపరేటివ్ అధ్యక్షుడు పెద్దిరాజు ఏ ఏ సి చైర్మన్ కొల్లు సత్యనారాయణ యూత్ అధ్యక్షుడు మాకిరెడ్డి రామకృష్ణ నాయుడు సర్పంచ్ల ఫోరం అధ్యక్షుడు నల్లవెల్లి శ్రీను ఎంపీడీవో డి. ఎన్ రత్నకుమారి, ఎపిఎం మంగ, పలు గ్రామాల సర్పంచులు, ఎంపీటీసీలు, వెలుగు సిబ్బంది మరియు డ్వాక్రా మహిళలు వైసిపి కార్యకర్తలు పాల్గొన్నారు.