అనకాపల్లి జిల్లా నర్సీపట్నం నియోజకవర్గం గొలుగొండ మండలం ఏ ఎల్ పురం మేజర్ పంచాయతీలో జాతీయ ఓటర్ దినోత్సవ సందర్భంగా ప్రతిజ్ఞ చేయించి గ్రామంలో గల సీనియర్ సిటిజన్ ( ఓటర్ )ని సన్మానించిన గ్రామ సర్పంచ్ జిల్లా ఎస్సీ సెల్ అధ్యక్షురాలు శ్రీమతి లోచల సుజాత,
పాఠశాల ప్రధానోపాధ్యాయులు వి. నాగభూషణం, ఎంపీటీసీ చింతల బుల్లి ప్రసాద్, సచివాలయం సెక్రటరీ కె.రాజేష్,వీఆర్వో శాంభ మూర్తి, ఈ సందర్భంగా సర్పంచ్ సుజాత మాట్లాడుతూ ఓటు హక్కు అనేది చాలా విలువైన ఆయుధమని దీని ద్వారా ఒక మంచి పరిపాలన అందించే నాయకులను మనం ఎన్నుకునే అవకాశం ఉంటుందని కాబట్టి 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరూ ఓటర్ నమోదు చేసుకొని దానిని వినియోగించుకోవాలని ఆమె కోరారు.
ఈ కార్యక్రమంలో సచివాలయం మహిళా పోలీస్ భూలక్ష్మి,ఇంజనీరింగ్ అసిస్టెంట్ ఝాన్సీ, అగ్రికల్చర్ అసిస్టెంట్ స్వర్ణ, వాలంటీర్లు మరియు పాఠశాల సిబ్బంది పాల్గొన్నారు.