56వ జాతీయ గ్రంథాలయ వారోత్సవాలు అనకాపల్లి జిల్లా తాళ్లపాలెం గ్రంథాలయ శాఖ వారు ఆధ్వర్యంలో జరిగిన పోటీలు
ఈ వారోత్సవాల్లో దాదాపు నాలుగు స్కూల్లో విద్యార్థులు 100 మంది పాల్గొనగా అందులో డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ గురుకుల విద్యార్థులు ఉన్నారు డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ గురుకుల విద్యార్థులు 25 మంది ప్రథమ ద్వితీయ స్థానంలో నిలిచారు
ఈ వారోత్సవాలు 14.11.2023 నుండి 20.11.2023 వరకు జరిగాయి క్విజ్ వ్యాసరచన కవి సమ్మేళనం దేశభక్తి గీతాలు డిబేట్ చదరంగ పోటీలు మ్యూజిక్ ముగ్గులు పోటీలు జరపగా అన్ని పోటీలలో కూడా గురుకుల విద్యార్థులు పాల్గొని 25 ప్రైజులు ప్రధమ ద్వితీయ బహుమతులు గెలుసుకోవడం జరిగింది
20 తేదీన ముగింపు సభలో ఎంపీటీసీ భవాని గణేష్ డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ గురుకుల ప్రిన్సిపల్ జి గ్రేస్ మరియు లైబ్రేరియన్ టీచర్ ఎం భారతి మరియు మిగతా స్కూల్ సిబ్బంది పాల్గొన్నారు సభలో డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ గురుకుల ప్రిన్సిపాల్ మాట్లాడుతూ మా గురుకుల విద్యార్థులు ఇన్ని బహుమతులు గెలవడం మాకు మరియు మా సిబ్బందికి చాలా సంతోషంగా ఉందన్నారు అలాగే పిల్లల గ్రంథాలయాల్లో పుస్తకాలు చదవడం వలన విద్యార్థులకు మంచి అలవాట్లు తో పాటు మంచి జ్ఞానం వస్తుందని విద్యార్థులకు మంచి సూచనలు సలహాలు ఇచ్చారు అలాగే ఎంపీటీసీ భవానీ గణేష్ మాట్లాడుతూ విద్యార్థినీ విద్యార్థులు వివిధ క్రీడా పోటీల్లో పాల్గొనడం చాలా గర్వంగా ఉందని తెలిపారు