బాణాసంచా దుకాణాల కేటాయింపు పై తప్పుడు ఆరోపణలు చేస్తే సహించేది లేదు

 బాణాసంచ దుకాణాల కేటాయింపు పై తప్పుడు ఆరోపణలు చేస్తే సహించేది లేదు 

మున్సిపల్ చైర్ పర్సన్ సుబ్బలక్ష్మి

నర్సీపట్నం నవంబర్ 8 బాణాసంచా దుకాణాల కేటాయింపు పై తప్పుడు ఆరోపణలు మానుకోవాలని అనకాపల్లి జిల్లా నర్సీపట్నం మున్సిపల్ చైర్ పర్సన్ బోడపాటి సుబ్బలక్ష్మి పేర్కొన్నారు. బాణాసంచా దుకాణాలు ఏర్పాటుకు పెద్ద చెరువు ప్రాంతాన్ని కేటాయించమన్నారు. దుకాణాల కేటాయింపు ప్రక్రియ మొదలకాకుండానే తప్పుడు ఆరోపణలకు దిగటం మంచి పద్ధతి కాదన్నారు. దీపావళి పండుగ సందర్భంగా మందుగుండు సామాగ్రి అమ్ముకునేందుకు పట్నంలో చాలామంది వ్యాపారులు అనుమతుల కోసం దరఖాస్తు చేసుకున్నారన్నారు. లైసెన్స్ దారుల సంఖ్యను బట్టి దుకాణాల కేటాయింపు జరుగుతుందన్నారు. ఆరోపణలకు తోవ లేకుండా డ్రా విధానంలో దుకాణాలు కేటాయించేందుకు మున్సిపల్ అధికారులు చర్యలు చేపట్టారు అన్నారు. దుకాణాల విషయంలో ఎవరితోనూ మంతనాలు జరిపే అవసరం తనకు లేదన్నారు. వాస్తవాలు తెలుసుకోకుండా తప్పుడు ప్రకటనలు చేస్తే తగిన మూల్యం చెల్లించుకోక తప్పదని హెచ్చరించారు. బాణాసంచా వ్యాపారంలో ఏ ఒక్కరికి నష్టం జరగకుండా పారదర్శకంగా దుకాణాల కేటాయింపు జరుగుతుందని చైర్పర్సన్ పేర్కొన్నారు.