కార్యకర్తలు సమావేశం లో ఎమ్మెల్యే గణేష్
ఆంధ్ర ప్రదేశ్ కి జగనే ఎందుకు కావాలంటే....
అనే కార్యక్రమాన్ని అమలుచేయడంలో భాగముగా నిర్వహిస్తున్న మండల స్థాయి శిక్షణ కార్యక్రమం గొలుగొండ మండలానికి సంభందించి నర్సీపట్నం నియోజకవర్గ YSR కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో మండల పార్టీ అద్యక్షులు లెక్క సత్యనారాయణ అధ్యక్షతన గురు వారం మధ్యాహ్నం నిర్వహించారు..ఈ సందర్భంగా నర్సీపట్నం ఎమ్మెల్యే పెట్ల ఉమా శంకర గణేష్ గారు ఈ శిక్షణ కార్యక్రమాన్ని ఉద్దేశించి మాట్లాడుతూ....
ఆంధ్రప్రదేశ్ కి జగనే ఎందుకు కావాలంటే అనే ప్రచారం, జగనన్న ప్రభుత్వం చేసిన నిజమైన అభివృద్దిని ప్రతి ఇంటికి తీసుకెళ్లేందుకు వైయెస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, సచివాలయ కన్వీనర్లు, కార్యకర్తలు, గృహ సారధులు మరియు వాలంటీర్లు చేపడుతున్న కార్యక్రమం. ఈ ప్రచారం ద్వారా, “2024 ఎన్నికలకు, మళ్ళి బూటకపు హామీలతో వస్తున్నావు. నీ అబద్దాలు మాకు తెలుసు . నిన్ను నమ్మం చంద్రబాబు” అన్న కీలక సందేశాన్ని ప్రతి ఇంటికి తీసుకెళ్ళాలి అని తెలియచేసారు. అందుకే మండల స్థాయిలో MLA / నియోజకవర్గ కోఆర్డినేటర్ల అద్వర్యంలో పార్టీ మండల అధ్యక్షులు మరియు ఇతర సీనియర్ మండల నాయకులు, సచివాలయం కన్వీనర్లు, గృహ సారధులు మరియు గ్రామ/వార్డు వాలంటీర్లుకు శిక్షణ ఇవ్వడమే ఈ కార్యక్రమం లక్ష్యం అని తెలియచేసారు. ప్రతి ఇంటికి ఏదోవక రకమైన మేలు చేసిన ముఖ్యమంత్రి శ్రీ YS జగన్ మోహన్ రెడ్డి గారు అని తెలియచేసారు. ఈ రోజు రాష్ట్రాన్ని సచివాలయం – వాలంటీర్ల వ్యవస్థతో దేశానికే ఆదర్శంగా నిలబెట్టిన ఘనత మన గౌరవ ముఖ్యమంత్రి గారు అని అన్నారు. నర్సీపట్నం నియోజకవర్గానికి వందల కోట్లు విడుదల చేసిన ఏకైక ముఖ్యమంత్రి శ్రీ YS జగనమోహన్ రెడ్డి గారు అని తెలియచేసారు.మరి ఈ కార్యక్రమంలో భాగంగా వైయెస్ఆర్ సిపి సచివాలయం శిబిరాలు ఏర్పాటు చేసి సంక్షేమ పధకాల డిస్ప్లే బోర్డు ఆవిష్కరణ, వైయెస్ఆర్ సిపి జెండా ఎగురవేయడం, ఊరి లేదా గ్రామ పెద్దలతో డిన్నర్ మరియు రాత్రి బస, ఆ తరువాత ఆంధ్ర ప్రదేశ్ కి జగనే ఎందుకు కావాలంటే.... ‘ఇంటింటికి ప్రచారం చేసి మన ప్రభుత్వం చేసిన మరియు అందించిన సంక్షేమ కార్యక్రమాలను గత ప్రభుత్వాలతో పోల్చిచుసి ప్రజలకు తెలియ చేయాలని ఈ కార్యక్రమం ద్వారా గౌరవ శాసనసభ్యులు పెట్ల ఉమా శంకర గణేష్ పార్టీ కార్యకర్తలకు, నాయకులకు దిశా నిర్దేశం చేశారు.కార్యక్రమంలో నర్సీపట్నం మార్కెట్ కమిటీ చైర్మన్ చిటికెల భాస్కరనాయుడు, ZPTC సుర్ల వెంకట గిరిబాబు, MPP మణికుమారి, SC సెల్ జిల్లా అధ్యక్షులు లోచల సుజాత, యూత్ ప్రెసిడెంట్ రామకృష్ణం నాయుడు, రైతు సంఘం నాయకులు పోలిరెడ్డి రాజుబాబు, BC సెల్ అధ్యక్షులు, ST సెల్ అధ్యక్షులు, సర్పంచ్ ల సంఘం అధ్యక్షులు, PACS అధ్యక్షులు, AAC చైర్మన్ , మండల పార్టీ మీడియా ప్రతినిది తదితరులు ఈ కార్యక్రమంలో ప్రసంగించారు. ఈ కార్యక్రమంలో గొలుగొండ మండల వైయెస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రజా ప్రతినిధులు, గృహ సారధులు, వాలంటీర్స్ అధిక సంఖ్యలో ఈ శిక్షణ కార్యక్రమంలో పాల్గొన్నారు.