9tvDigital గొలుగొండ.అంబేద్కర్ ఇండియా మిషన్(AIM ) వ్యవస్థాపక అధ్యక్షులు, ఏపీ ఫైర్ సర్వీస్ అండ్ డిజాస్టర్ మేనేజ్మెంట్ డిజిపి పీవి.సునీల్ కుమార్ ఐపీఎస్ ఈనెల 28న ఉదయం 10:00 గంటలకు (రేపు) అనకాపల్లి వస్తున్నారని ఏయిమ్ జిల్లా కో కన్వీనర్ సరమండ వీరబాబు తెలిపారు.ఈమేరకు గొలుగొండలో ఓక ప్రకటన విడుదల చేశారు. ముందుగా ఆయన అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి, అనంతరం మొక్కలు నాటే కార్యక్రమం చేపడతారని,తర్వాత రైల్వే స్టేషన్ వద్ద ఉన్న శ్రీ లక్ష్మి శ్రీనువాస కల్యాణమండపంలో జరిగే AIM ఉద్యోగులతో జరిగే ఆత్మీయ సమ్మేళనం కార్యక్రమంలో పాల్గొంటారన్నారు. అనంతరం ఏయిమ్ నాయకులకు, కార్యకర్తలకు AIM అజెండా మన వాడ, మన పంచాయతీ తో అనగారిన వర్గాలకు జరిగే అభివృద్ది పై వివరించి భవిష్యత్తు కార్యక్రమాలపై దిశా నిర్దేశం చేస్తారని ఈ సందర్బంగా అయన తెలిపారు.కావున మండలంలో ఉన్న అంబేద్కర్ వాదులు,AIM నాయకులు, కార్యకర్తలు హాజరుకావాలని కోరారు.