9tvDigital అనకాపల్లి జిల్లా గొలుగొండ మండలంతహసిల్దార్ గారా ఆనంద్ కు ఘనంగా సత్కారం జరిగింది. మంగళవారం దళిత సేవ పరిరక్షణ (డి.యస్.పి) జిల్లా అద్యక్షులు యాదగిరి దాసు,దళిత కులాల సంక్షేమ సేవా సంఘం జిల్లా అధ్యక్షులు చిట్ల చలపతి ఆధ్వర్యంలో గొలుగొండ మండలం తహశీల్దార్ గారా ఆనంద్ కి సన్మానం చేశారు. స్థానిక సర్పంచ్ కసిపల్లి అప్పారావు (బుజ్జి),జిల్లా విజిలెన్స్ ఎండ్ మానిటరింగ్ కమిటీ సభ్యులు యమ్ ఏ రాజు, జిల్లా ఎస్సీ సెల్ అధ్యక్షురాలు లోచల సుజాత తదితరులు హాజరై తహశీల్దార్ కు ఘనంగా సన్మానం చేసి మెమొంటో అందించారు. జిల్లాలోనే అత్యంత సుందరంగా తహశీల్దార్ కార్యాలయాన్ని ఆధునికరణ , జిల్లా కలెక్టర్ తో ప్రశంసలు పొందడమే దీనికి ముఖ్య కారణం అని అన్నారు.ప్రభుత్వం నిధులు ఇచ్చినా... చిత్తశుద్ధితో పని పూర్తి చేసే అధికారులు, నాయకులను గౌరవిస్తామన్నారు. డి యస్ పి సంఘం నర్సీపట్నం నాయకులు అల్లంపల్లి సతీష్ కుమార్, తహశీల్దార్ కార్యాలయం సిబ్బంది కార్యక్రమంలో పాల్గొన్నారు.