ఏ ఏ సి చైర్మన్ కొల్లు సత్యనారాయణ పెన్షన్సు పంపిణీ చేశారు

                                   

 అనకాపల్లి జిల్లా నర్సీపట్నం నియోజకవర్గంలో సిఎం జగన్ మోహన్ రెడ్డి అదేశాల మేరకు గొలుగొండ మండలం రావణ పల్లి సచివాలయం పరిధిలో నూతనంగా నాలుగు పెన్షన్లు మంజూరు చేసిన స్థానిక ఎమ్మెల్యే పెట్ల ఉమా శంకర్ గణేష్  నిరుపేద వృద్ధాప్యం వికలాంగుల విడో కుటుంబాలకు మంజూరు చేశారని తెలిపారు.అందులో రెండు విడో పెన్షన్స్ ఒకటి వృద్దాప్యం పెన్షన్ మరోకటి వికలాంగుల పెన్షన్లు అన్నారు. అలాగే వైఎస్ఆర్సీపీ ఎ ఏ సి చైర్మన్ కొల్లు సత్యనారాయణ చేతులు మీదుగా పంపిణీ చేశారు.అయన మాట్లాడుతూ వైయస్సార్ పార్టీ కోసం తన ఎల్లప్పుడూ పనిచేస్తానని తెలిపారు.ఈ కార్యక్రమానికి ఏ ఏ సి చైర్మన్ కొల్లు సత్యనారాయణ, సచివాలయం సిబ్బంది లక్ష్మీ, శ్రీ లక్ష్మీ, మనోజ్, సూర్యకుమారి, వాలంటీర్లు, తదితరులు పాల్గొన్నారు.