డ్వాక్రా సంఘాలు బలోపేతానికి కృషి వి వో ఏ ల సమావేశంలో పాల్గొన్న డిఆర్డిఏ పిడి లక్ష్మిపతి

 గొలుగొండ   రిపోర్టర్ మాణిక్యం                             


   అనకాపల్లి జిల్లా గొలుగొండ మండలం ఐకెపి కార్యాలయంలో స్త్రీ నిధి  రుణాల చెల్లింపులు 100% జరిగేటట్లుగా వివోఎ లందరూ పనిచేయాలని అనకాపల్లి జిల్లా డిఆర్డిఏ పి డి లక్ష్మీపతి అన్నారు. మండల కేంద్రంలో మండల మహిళా సమైక్యలో శుక్రవారం జరిగిన వివోఎల సమీక్ష కార్యక్రమానికి ఆయన హాజరయ్యారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ స్త్రీ నిధి రుణాల రికవరీ పై సంఘ సభ్యులందరికీ పూర్తిస్థాయి అవగాహన ఉండాలి సంఘాల రుణాలు మంజూరులో పారదర్శకతఉండాలి. క్షేత్రస్థాయి సిబ్బంది అందరూ రుణాలపై సంఘ సభ్యులకు పూర్తి అవగాహన కల్పించాలి అలాగే సంఘ సభ్యులు గ్రామాల్లో కిచెన్ గార్డెన్ పెంపకంపై దృష్టి సారించాలని ఆయన అన్నారు మహిళలందరూ కిచెన్ గార్డెన్ పెంపకంపై అవగాహన కల్పించుకొని పోషక విలువలతో కూడిన ఆహారాన్ని కుటుంబ సభ్యులందరికీ అందించే విధంగా చర్యలు చేపట్టాలన్నారు

చేపట్టాలన్నారు దీనికి సంబంధించిన విత్తనాలను వివోఏలకు డిస్ప్లే చేస్తూ వివరించారు జిల్లాలో మండలం రెండో స్థానంలో ఉందని దీనికి క్షేత్రస్థాయిలో పనిచేస్తున్న సిబ్బంది అందరూ సహకారమే కారణమని కొనియాడారు త్వరలో జిల్లాలో ఫ్యాషన్ టెక్నాలజీ  శిక్షణ, ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లు మోడల్గా ప్రారంభించిన ఉన్నామని ఆయన తెలిపారు ఈ కార్యక్రమంలో నర్సీపట్నం క్లస్టర్ ఏరియా కోఆర్డినేటర్ సత్యనారాయణ గొలుగొండ ఎపిఎం పి మంగ నర్సీపట్నం క్లస్టర్ లీగల్ కోఆర్డినేటర్ శ్రీనివాస్ స్త్రీ నిధి మేనేజర్ కనకమహాలక్ష్మి మండల వెలుగు సిబ్బంది వివోఏలు పాల్గొన్నారు