గుంటూరు :
ఆటో ప్రమాదంలో గాయపడిన ప్రత్తిపాటి లావణ్య అనే 9 నెలల నిండు గర్భిణీని తన సొంత వాహనంలో తెనాలి ప్రభుత్వ ఆసుపత్రికి తరలింపు
మంగళగిరి ఎమ్మెల్యే ఆర్కే ఈరోజు ఉదయం రేవేంద్రపాడులో తన పర్యటన ముగించుకుని మంగళగిరి వస్తున్న సమయంలో పెడవడ్లపుడి రైల్వే ఓవర్ బ్రిడ్జి దిగువున ప్రమాదవశాత్తు ఆటో పల్టీ కొట్టింది, అటుగా వెళుతున్న ఎమ్మెల్యే ఆర్కే వెంటనే తన కాన్వాయ్ ని ఆపి తన సిబ్బందితో కలిసి ఆటోను పైకి లేపి క్షతగాత్రులను రక్షించారు.
ఆటోలో వున్న 9 నెలల నిండు గర్భిణీ స్త్రీ (ప్రత్తిపాటి లావణ్య) ఉండడంతో వెంటనే తన వాహనంలో తన సిబ్బందితో తెనాలి ప్రభుత్వ ఆసుపత్రికి పంపించారు.
ప్రత్తిపాటి లావణ్య ను తెనాలి ప్రభుత్వ ఆసుపత్రిలో అత్యవసర విభాగం వైద్యులు పరీక్షించి తన ఆరోగ్య పరిస్థితి బాగానే ఉందని తెలిపారు.