చంద్రయాన్ 3 విజయవంతమైన సందర్భంగా ఇస్రో శాస్త్రవేత్తలకు,భారతదేశ ప్రజలకు శుభాకాంక్షలు తెలియజేస్తూ అవనిగడ్డ శాసనసభ్యులు సింహాద్రి రమేష్ బాబు ఆధ్వర్యంలో 5000 మంది విద్యార్థులతో జాతీయ జెండాలు చేతపట్టి బారీ ర్యాలీ నిర్వహించిన అవనిగడ్డ మండల విద్యా కుటుంబం.
జాతీయ జెండాలు ప్రదర్శిస్తూ జయహో భారత్ జయహో ఇస్రో అంటూ విద్యార్థులు చేసిన నినాదాలతో మారు మోగిన అవనిగడ్డ గ్రామం
ఈ సందర్భంగా అవనిగడ్డ శాసనసభ్యులు సింహాద్రి రమేష్ బాబు మాట్లాడుతూ....
చంద్రయాన్ 3 విజయం ప్రతి ఒక్క భారతీయుడు గర్వించదగ్గ విషయం అని అన్నారు.
చంద్రయాన్ 3 విజయవంతం కావటానికి కృషి చేసిన ఇస్రో శాస్త్రవేత్తలు అందరికీ అవనిగడ్డ నియోజకవర్గం ప్రజలు తరఫున శుభాకాంక్షలు తెలియజేశారు
చంద్రయాన్ 3 విజయంతో ఒక భారతదేశంలోనే కాక ప్రపంచ దేశాల లో ఉన్న భారతీయులందరూ సంబరాలు జరుపుకుంటున్నారని అన్నారు
చంద్రయాన్ 3 విజయవంతం అవటానికి కృషి చేసిన శాస్త్రవేత్తలు అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ నియోజకవర్గం లోని ప్రజలందరూ కలిసి సంతకాలు చేసి పంపించడం జరుగుతుందన్నారు
ప్రపంచ దేశాలు మొత్తం భారతదేశం వైపు చూసేలా కృషిచేసిన శాస్త్రవేత్తల అందరికీ పేరుపేరునా కృతజ్ఞతలు తెలియజేశారు.
ఈ కార్యక్రమంలో వీరితోపాటు ఉమ్మడి కృష్ణ గుంటూరు జిల్లాల రైతు విభాగ జోనల్ ఇంచార్జ్ నరసింహారావు , అవనిగడ్డ నియోజకవర్గ యువ నాయకులు సింహాద్రి వికాస్ బాబు , అవనిగడ్డ డిఎస్పి మురళీధర్, మండల ప్రజా ప్రతినిధులు, పలువురు అధికారులు పాల్గొన్నారు.