హింసను ప్రోత్సహించింది చంద్రబాబే - ఎ.పి . మంత్రి అంబటి
అధికారంలో లేకపోతే ఫ్యాక్షన్ ను పెంచి పోషిస్తున్న బాబు.
కుప్పంలో దాహార్తిని తీర్చేందుకు జగన్ కృషి.
తాగునీటి పథకాలకు స్టే తెప్పించి అడ్డంకి సృష్టించిన చంద్రబాబు
బాబు ది ప్రాజెక్టుల సందర్శన కాదు... హింసాత్మక యాత్ర
సత్తెనపల్లి: పుంగనూరులో జరిగిన అల్లర్లకు, హింసకాండ కు చంద్రబాబే కారణమని ఆయన ప్రోత్బలం, ప్రోత్సాహంతోనే ఈ ధమనకాండ జరిగిందని రాష్ట్ర జలవనరుల శాఖామాత్యులు అంబటి రాంబాబు ఆరోపించారు. శనివారం నియోజకవర్గ కార్యాలయంలో జరిగిన పాత్రికేయుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ మంత్రి పెద్దిరెడ్డి నియోజకవర్గం లో ఘర్షణ వాతావరణం సృష్టించేందుకు ,కుట్రపూరిత చర్యలతోనే పోలీసుల అనుమతి లేని మార్గంలో చంద్రబాబు పర్యటన కొనసాగించి రెచ్చగొట్టే వ్యాఖ్యలతో అల్లర్లకు కారకుడయ్యారని దుయ్యబట్టారు. 14 యేళ్ళు ముఖ్యమంత్రిగా చేసి కుప్పంలోనూ తాగునీటి ప్రాజెక్టులు ఏవీ నిర్వహించకుండా ఇప్పుడు ప్రాజెక్టుల సందర్శన యాత్ర పేరుతో ఏ విధంగా ఇక్కడ పర్యటిస్తున్నారని వైఎస్ఆర్సిపి నాయకులు పోలీసుల అనుమతితో నిరసన ప్రదర్శన చేసి వెళ్లిపోయారన్నారు.అనంతరం అనుమతి లేని ప్రాంతంలో పర్యటించేందుకు చంద్రబాబునాయుడు ప్రయత్నించగా పోలీసులు అడ్డుకోవడంతో వారిపైనే అనంతపురం నుంచి వచ్చిన రౌడీమూక పోలీసులపై దాడులు చేసి గాయపరిచి , వాహనాలను తగలబెట్టిందని డబుల్ బ్యారల్ గన్ తో వచ్చి కుట్రపూరితంగా, ప్రణాళికాబద్ధం గానే పుంగనూరును భయభ్రాంతులకు గురి చేశారని ఆరోపించారు. ప్రాజెక్టులను సందర్శించే నైతిక హక్కు చంద్రబాబుకు లేదని నిప్పులుచెరిగారు.
రాయలసీమ డ్రిప్ ఇరిగేషన్ ప్రాజెక్టుకు రూ.4,800 కోట్లు కేటాయించి సాగు, తాగునీటికి జగన్ కృషి చేస్తున్నారన్నారు. రూ 2,114 కోట్లతో గండికోట నుంచి సాగునీటిని ఎత్తిపోతల ద్వారా తరలించేందుకు ఈ ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు. 60 శాతం పనులు పూర్తవుగా చంద్రబాబునాయుడు స్టే తెప్పించి ప్రజలకు జరిగే మేలు అడ్డుకున్నాడని దుయ్యబట్టారు.
కానిస్టేబుల్ కొడుకుని చెప్పుకుంటున్న దత్తపుత్రుడు.. పోలీసులకు గాయాలయితే స్పందించకపోగా చంద్రబాబుకు వంతపాడటం దారుణమన్నారు.
ఈ సమావేశంలో మున్సిపల్ నాయకులు చర్లంచర్ల సాంబశివరావు, వైస్ చైర్మన్ షేక్ నాగూర్ మీరాన్, పట్టణ, రూరల్ కన్వీనర్లు సహారా మౌలాలి, రాయపాటి పురుషోత్తమ రావు, పల్నాడు జిల్లా వాణిజ్య విభాగం అధ్యక్షులు అచ్యుత శివప్రసాద్,, ఎస్సీ సెల్ అధ్యక్షులు చిలక జైపాల్,, కౌన్సిలర్లు, ప్రజాప్రతినిధులు, వైయస్సార్సీపి అనుబంధ సంఘాల బాధ్యులు, తదితరులు ఉన్నారు