అంగరంగ వైభవంగ నాగపురంలో మరిడిమాంబ జాతర మహోత్సవం

9టీవీ  న్యూస్ గొలుగొండ

రిపోర్టర్// మాణిక్యం.

అనకాపల్లి జిల్లా గొలుగొండ మండలం నాగాపురం గ్రామం లో  మరిడిమాంబ మహోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది. భారీ ఊరేగింపుగా అమ్మవారి ఆలయానికి చేరుకుని పూజా కార్యక్రమాలు చేపట్టారు.


ఊరేగింపులో యువతీయువకుల తీన్మార్ డాన్స్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. పండుగ ఆద్యంతం నేత్రపర్వంగా సాగింది. ఇందుకోసం ఆలయాన్ని సర్వాంగ సుందరంగా ముస్తాబు చేశారు. గురువారం ఉదయాన్నే ఆలయంలోని అమ్మవారికి ప్రత్యేక కుంకుమ పూజలు నిర్వహించారు. అనంతరం భక్తులను దర్శనాలకు అనుమతించారు.  ఆలయ కమిటీ, గ్రామ పెద్దల ఆధ్వర్యంలో ఏర్పాట్లు చేపట్టారు. భక్తులకు ప్రసాదాన్ని పంపిణీ చేశారు. ఈ సందర్భంగా సర్పంచ్ యలమంచిలి రఘురామ చంద్రరావు మాట్లాడుతూ గ్రామమంతా జాతరకు సహకరించిన ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు తెలిపారు. ఆ అమ్మవారి కరుణా కటాక్షాలతో

ప్రజలంతా సుఖసంతోషాలతో మెలగాలని దేవతను వేడుకున్నారు.