బ్రహ్మంగారు లాగే బాబా వాంగా భవిష్యవాణి ,, 2023.. యుగాంతమేనా?


బ్రహ్మంగారు నోస్ట్రడామస్ మాదిరిగానే బాబా వంగా కూడా
భవిష్య వాణి చెప్పడంలో చాలా పాపులర్. బల్గేరియా దేశానికి చెందిన బాబా వంగా 1911లో జన్మించి 1996లో మృతి చెందారు. ఆమె భవిష్యత్లో జరగబోయే ఎన్నో విషయాలు గురించి చెప్పారని.. వాటిలో చాలా వరకు నిజమయ్యాయని అంటున్నారు.ఈ నేపథ్యంలో బాబా వంగా 2023 గురించి గతంలో చెప్పిన విషయాలు అందరిలో గుబులు రేబుతున్నాయి. 2023కి సంబంధించి బాబా వంగా చెప్పిన అంశాలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి.


గతంలో చైనాలోని వూహాన్లోని ఒక ల్యాబ్ నుంచి పుట్టుకొచ్చిన కరోనా వైరస్ ప్రపంచ దేశాల్లో పెను విధ్వంసం సృష్టించిన సంగతి తెలిసిందే.  కోట్ల మంది ప్రజలు కరోనా బారినపడ్డారు. కొన్ని లక్షల మంది మరణించారు.
అలాగే 2023లో భారీ సౌర తుపాను విరుచుకుపడుతుందని బాబా వంగా జోస్యం చెప్పారు. ఈ సౌర తుపాను దాటికి కమ్యూనికేషన్ వ్యవస్థలు (ఫోన్లు ఇంటర్నెట్ వ్యవస్థలు) పూర్తిగా స్తంభించిపోతాయని చెబుతున్నారు...
ఇక అన్నింటికంటే ముఖ్యంగా 2023లో భూమి కక్ష్య మారిపోతుందని బాబా వంగా తన కాలజ్ఞానంలో తెలిపారు. ఇప్పటికే భూమి కక్ష్య మార్పుపై శాస్త్రవేత్తలు అనేక అంచనాలు వివరణలు ఇస్తూ వస్తున్నారు. ఈ నేపథ్యంలో వంగా బాబా చెప్పినట్టు భూమి కక్ష్య మారిపోతే సృష్టి విశానం తప్పదని అంటున్నారు.కాగా బాబా వంగా జీవ ఆయుధాలు (బయో వెపన్స్) గురించి తన భవిష్యవాణిలో చెప్పారని అంటున్నారు. ఈ జీవ ఆయుధాలపై ప్రయోగాలు చేస్తున్న ఒక పెద్ద దేశం కారణంగా ప్రపంచవ్యాప్తంగా వేలాది మంది ప్రజలు మరణిస్తారని వంగా బాబా పేర్కొనడం సంచలనం సృష్టిస్తోంది. దీంతో ఇప్పుడు ఆ పెద్ద దేశం అమెరికానా లేక చైనానా అనేదానిపై ఊహాగానాలు చెలరేగుతున్నాయి.