మొన్నటి వరకు కరోనా తో విల విల లాడిన జనం ఇప్పుడిప్పుడే తేరుకున్నారు ..ఒక పక్క ఒకటో రెండో కేసులు వస్తున్నా దైర్యంగా తిరుగుతున్నారు ..ఎదో ఒక వైరస్ తో జనం బిక్కు బిక్కు మంటూ బ్రతుకుతున్నారు ,,ఇప్పుడేమో మంకీపాక్స్ ,,కొత్తగా భయపడుతుంది ..మన ఇండియా లో కూడా కేసులు నమోదవుతున్నాయి ..
అమెరికా దేశంలో ఇప్పటికే 6,600 మంకీపాక్స్ కేసులు నమోదయ్యాయి.న్యూయార్క్ నగరంలో మంకీపాక్స్ కేసులు అధికంగా నమోదవడంపై యూఎస్ వైద్యాధికారులు ఆ నగరంపై దృష్టి సారించారు.
ఆఫ్రికా దేశంలో మంకీపాక్స్ వైరస్ గతంలో కంటే భిన్నంగా ప్రధానంగా లైంగిక కార్యకలాపాల ద్వారా వ్యాపిస్తోంది.పురుషులు పలువురు పురుషులతో సంబంధాలు పెట్టుకుంటే మంకీపాక్స్ వచ్చే ప్రమాదముందని గుర్తించిన అమెరికా వైద్యాధికారులు హెల్త్ క్లినిక్ లను ఏర్పాటు చేశారు.
మంకీపాక్స్ సోకిన రోగులను ఐసోలేషన్‌లో ఉంచాలని, ప్రజలు వారికి దూరంగా ఉండాలని వైద్యులు సూచించారు.మంకీపాక్స్ సోకే అవకాశమున్న రిస్క్ గ్రూపు వారికి వ్యాక్సిన్ అందించాలని నిర్ణయించారు.