ఆర్ఆర్ఆర్' పూర్తి చేసిన మోడీషా


ఎవరెన్ని వాదనలు.. సిద్ధాంతాల్ని తెర మీదకు తీసుకొచ్చినా..
ప్రతి దాన్లోనూ ఏదో ఒక లోపం కనిపిస్తూనే ఉంది తప్పించి.. ఇద్దరిమధ్య భేటీ మర్మం ఏమిటన్న దానిపై పక్కా వాదన వినిపించినోళ్లే కనిపించని వైనం కొట్టొచ్చినట్లుగా కనిపిస్తోందని చెప్పాలి.

తారక్ ను పిలిపించుకొని మరీ భేటీ అయిన కేంద్ర హోం మంత్రి అమిత్ షా తీరుపై పలువురు అభ్యంతరం వ్యక్తం చేశారు. ఆర్ఆర్ఆర్ మూవీకి అభినందనలు తెలియజేసేందుకు తారక్ ను పిలిపించినట్లుగా చెబుతున్నప్పటికి.. చాలామంది ఆ వాదనను అంగీకరించని పరిస్థితి.


నిజంగానే ఆర్ఆర్ఆర్ సినిమాలో అద్భుతంగా నటించిన ఎన్టీఆర్ ను  అభినందించటమే లక్ష్యమైతే.. ఈ సినిమాలో అద్భుతంగా నటించిన రాంచరణ్ ను ఎందుకు ఆహ్వానించలేదు? అన్నది ప్రశ్నగా మారింది. దీనికి వస్తున్న సమాధానం ఆసక్తికరమే కాదు.. నిజమే కదా? అన్నట్లు అనిపిస్తున్నా.. అందులో ఏ మాత్రం నిజం లేదంటున్నారు.

నిజానికి ఇంతవరకు పెండింగ్ ఉన్నది తారక్ అని.. అది కాస్తా పూర్తి అయ్యిందని చెబుతున్నారు. అదెలానంటే.. 'ఆర్ఆర్ఆర్'కి సంబంధించి ఇప్పటికే రాంచరణ్ ను అభినందించటం తెలిసిందే. మరో 'ఆర్' అయిన రాజమౌళి విషయానికి వస్తే.. ఆయన తండ్రికి రాజ్యసభ సీటును కేటాయించటం ద్వారా లెక్కలు సెట్ చేశారని చెప్పాలి.