తొందర్లోనే ఏపీ కి శ్రీలంక పరిస్థితులు


నేను ఏదో అద్భుతాలు జరిగిపోతాయని పార్టీ పెట్టలేదు.
దెబ్బలు తిన్నా ప్రజల కోసం నిలబడాలని రాజకీయాల్లోకి వచ్చా. మనల్ని వెతుక్కుంటూ పదవి రావాలి తప్ప... దాని వెంట మనం పడకూడదు. సంక్షేమ పథకాలకు జనసేన పార్టీ వ్యతిరేకం కాదని.. సంక్షేమం పేరుతో అభివద్ధిని విస్మరించడాన్ని మాత్రం వ్యతిరేకిస్తుంది. ఒక తరానికి బాధ్యత గుర్తు చేయడానికి, మరో తరాన్ని మేల్కొల్పడానికి జనసేన పార్టీని స్థాపించా. ఒక ఎలక్షన్‌ కోసమైతే పార్టీలోకి రావొద్దు. ఒకవైపు సుప్రీం కోర్టు.. మరోవైపు కాగ్‌ చెబుతున్నా పట్టించుకోవడం లేదు. అతి త్వరలో ఏపీలో శ్రీలంక పరిస్థితులు రావొచ్చు. అక్కడ వరకూ రాకూడదనే కోరుకుంటున్నా’’ అని అన్నారు. ‘‘ఐటీ అభివద్ధికి జనసేన కట్టుబడి ఉందన్నారు. విభజన తర్వాత సీమ యువత హైదరాబాద్‌, బెంగళూరు వంటి నగరాలకు వలసపోతోంది. వచ్చే ఎన్నికల్లో జనసేన పార్టీని అధికారంలోకి తీసుకువస్తే ఏ ఒక్కరూ బయటకు వలస వెళ్లే పరిస్థితి ఉండదు. ఐటి పరిశ్రమను ఇక్కడే అభివద్ధి చేస్తాం’’ అని పవన్‌ అన్నారు.