మిస్ అయిన ఆ జవాన్ల మృతదేహలు,,38 ఏళ్ల తర్వాత


38 ఏళ్ల క్రితం కనిపించకుండా పోయిన ఐదుగురు భారత జవా
న్ల మృతదేహాల్లో ఇద్దరి మృతదేహాలు దొరికాయి. వీటిల్లో ఒకటి ఉత్తరాఖండ్ కు చెందిన జవానుగా గుర్తించగా.. రెండో మృతదేహాన్ని గుర్తించాల్సి ఉంది. మరింత ఆశ్చర్యకరమైన విషయం ఏమంటే.. మరణించి 38 ఏళ్లు అవుతున్నా.. ఇప్పటికి వారి మృతదేహాలు ఏ మాత్రం దెబ్బ తినకుండా చెక్కుచెదరకుండా ఉండటం. నిజానికి ఆ కారణంగానేఇద్దరు జవాన్లలో ఒకరిని గుర్తించగా.. మరొకరిని గుర్తించాల్సి ఉంది. 

మంచు కొండల్లో.. దట్టమైన మంచులోపల ప్రపంచంలోనే అత్యంత డేంజరస్ యుద్ధ క్షేత్రంగా చెప్పే సియాచిన్ కు 19కుమావన్ రెజిమెంట్ కు చెందిన 20 మంది సైనికుల టీం వెళ్లింది. అక్కడ పహరా కాస్తున్న సమయంలోనే అకస్మాత్తుగా విరుచుకుపడిన భారీ హిమపాతానికి అందరూ కొట్టుకుపోయారు.కూరుకొని ఉండటంతో డెడ్ బాడీలు చెడిపోలేదన్న మాట వినిపిస్తోందిఆ సమయంలో వారిలో 15 మంది మృతదేహాలు లభ్యం కాగా.. మరోఐదుగురు మాత్రం కనిపించలేదు.

తాజాగా సియాచిన్ లోని ఒక పాత బంకర్ లో ఇద్దరి మృతదేహాలు లభించాయి. వాటిని తనిఖీ చేయగా.. ఉత్తరాఖండ్ కు చెందిన చంద్రశేఖర్ హర్బోలా అని గుర్తించారు. ఇక.. అతని కుటుంబ సభ్యులు ప్రస్తుతం అల్మోరాలోనే ఉంటున్నారు. 1975లో సైన్యంలో చేరిన చంద్రశేఖర్.. చివరిసారిగా ఇంటి నుంచి 1984 జనవరిలో వెళ్లారని అతడి సతీమణి శాంతీదేవి పేర్కొన్నారు. ఆమె భర్త మృతదేహం లభించిన విషయాన్ని ఆమెకు చెప్పారు