ఎన్టీఆర్ 31 మూవీ లేటెస్ట్ లుక్


తారక్‌ హీరోగా ప్రశాంత్‌ నీల్‌ దర్శకత్వం వహిస్తున్న ‘ఎన్టీఆర్‌ 31’ షూటింగ్‌ వచ్చే ఏడాది ఏప్రిల్‌–మే నెలల్లో ప్రారంభం కానుందని సోమవారం దర్శకుడు వెల్లడించారు. ఎన్టీఆర్‌ 31సినిమాకు సంబంధించి ఆసక్తికర అప్‌డేట్‌ బయటకొచ్చింది. తారక్‌పుట్టినరోజు సందర్భంగా ఈ చిత్రంలోని ఇంటెన్స్‌ లుక్‌ విడుదల చేసిన ప్రశాంత్‌ నీల్‌ తాజాగా కొత్త అప్‌డేట్‌తో అభిమానుల్లో ఉత్సాహాన్ని నింపారు.

ఆర్‌ఆర్‌ఆర్‌’సక్సెస్‌ తర్వాత తారక్‌, ‘కేజీఎఫ్‌2 భారీ విజయం తర్వాత ప్రశాంత్‌ నీల్‌పని చేస్తున్న చిత్రం కావడంతో భారీ అంచనాలు నెలకొన్నాయి. దానికి తగ్గట్లే సినిమా ఉండబోతోందని దర్శకుడు చెబుతున్నారు. 

అయితే ఈ చిత్రంలో కీలకపాత్రల్లో పృథ్వీరాజ్‌ సుకుమారన్‌, ‘పొగరు’ ఫేం శ్రేయారెడ్డి నటించబోతున్నారని తెలిసింది. రూ.400 కోట్ల బడ్జెట్‌తో భారీ యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌గా ఈ చిత్రాన్ని రూపొందించనున్నారని నెట్టింట వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. మైత్రీ మూవీ మేకర్స్‌, ఎన్టీఆర్‌ ఆర్ట్స్‌ కలిసి ఈ ఈ చిత్రాన్ని నిర్మించనున్నాయి. ప్రస్తుతం తారక్‌ కొరటాల శివ సినిమాతో బిజీగా ఉన్నారు.