ఆ జండా పవర్,, పొగరు,, అంతా తన మొహంలో చూపిస్తూ,జనసేనాని


పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ‘ది ట్రూ డెమి గాడ్
ఆఫ్ తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ’. జయాపజయాలతో సంబంధం లేకుండా కేవలం తమ హీరోని తెరపై చూస్తే చాలు అనుకునే అభిమానులు ఉన్న ఏకైక హీరో పవన్ కళ్యాణ్. మాములుగా అయితే ఫాన్స్.. తమ అభిమాన హీరో సినిమాలనే ఫాలో అవుతూ ఉంటారు. కానీ పవన్ ఫాన్స్.. పవన్ కళ్యాణ్‌నే ఫాలో అవుతారు. 

అందుకే ఆయనకున్నది అభిమానులు కాదు భక్తులు అంటుంటారు. ఆన్ స్క్రీనే కాదు ఆఫ్ స్క్రీన్ కూడా పవన్ కళ్యాణ్ ఫోటో బయటకి వచ్చినా, పవన్ గురించి ఒక టాపిక్ రైజ్ అయినా సోషల్ మీడియాలో పవన్ ఫాన్స్ సునామీ సృస్టిస్తారు. డిజిటల్ మీడియాలో సైతం అత్యధిక ఫాన్ ఫాలోయింగ్ ఉన్నది ఒక్క పవర్ స్టార్ మాత్రమే. పవర్ స్టార్ అనే ట్యాగ్ ని నేషనల్ వైడ్ ట్రెండ్ చేస్తున్నారు. 

ఒక సినిమా అప్డేట్ లేదు, ఒక పోస్టర్ బయటకి రాలేదు. సడన్ గా ఎందుకు ట్రెండ్ చేస్తున్నారా అని చూస్తే.. పవన్ కళ్యాణ్ తన ట్విట్టర్ అకౌంట్ DP ని చేంజ్ చేశారు. బ్యాక్ గ్రౌండ్ లో జనసేన జెండా ఎగురుతూ ఉంటే, ఆ జండా పొగరు అంతా తన మొహంలో చూపిస్తూ.. పవన్ కళ్యాణ్ పెట్టిన ఫోటో అదిరిపోయింది. ఈ ఫోటోని వైరల్ చేస్తూ, పవన్ ఫాన్స్..ట్విట్టర్‌ని షేక్ చేస్తున్నారు.