ఇక అంబేద్కర్ కోనసీమగానే...

 


ఎట్టకేలకు ఈ రోజు జరిగిన మంత్రివర్గ సమావేశంలో ముఖ్యమంత్రి జగన్ కోనసీమ జిల్లాను అంబేద్కర్ కోనసీమ జిల్లాగా మారుస్తూ కీలక నిర్ణయం తీసుకున్నారు. దానికి మంత్రి వర్గం కూడా ఆమోదముద్ర వేసింది.

అదే విధంగా కొత్తగా ఏర్పాటు చేసిన రెవిన్యూ డివిజన్లూ మండలాలకు కూడా  మంత్రిమండలి ఆమోదముద్ర వేసింది. ఇక కోనసీమ పేరుని అలాగే ఉంచాలని కోరుతూ కోర్టులో పిటిషన్లు దాఖలు అయ్యాయి. వాటి మీద విచారణకు కోర్టు నిర్ణయం తీసుకుంది. మరి న్యాయపరమైన నిర్ణయం ఎలా ఉంటుందో చూడాలి.

మరో వైపు చూస్తే కొత్త జిల్లాకు అంబేద్కర్ పేరు పెట్టాలన్న ప్రతిపాదనల మీదనే అంత రచ్చ సాగుంది. అగ్గిలా కోనసీమ భగ్గుమంది. ఇపుడు ఏకంగా పేరుని డిసైడ్ చేశారు. మరి దాంతో కోనసీమలో ఏం జరుగుతుంది అన్న ఉత్కంఠ కూడా ఉంది. దీంతో పోలీసులు అప్రమత్తం అయ్యారు. కోన సీమ జిల్లాలో 1300 మందితో గట్టి పోలీసు బందోబస్తుని కూడా నిర్వహిస్తున్నారు.