ఆడబిడ్డలను కించపరిస్తే బలంగా సమాధానమిస్తాం


అడబిడ్డలపై , జరిగే  అన్యాలపై పవన్ కళ్యాణ్ గారి వాఖ్యలు 

రాజకీయాల్లో విమర్శలు, ప్రతి విమర్శలు సర్వసాధారణమే... స్థాయి దాటి ఆడబిడ్డలపై వ్యక్తిగత దూషణలకు దిగి కించపరిస్తే బలంగా సమాధానం చెప్పాల్సి ఉంటుంది.  మా పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి శ్రీమతి రాయపాటి అరుణ గారికి- ప్రకాశం జిల్లాకు చెందిన ఓ ఎమ్మెల్యే పక్కన ఉండేవాళ్ళు అర్థరాత్రి ఫోన్లు చేసి మానమర్యాదలకు భంగం వాటిల్లేలా మాట్లాడటం ఏం పధ్ధతి? ఈ విషయాన్ని సామాజిక మాధ్యమాల ద్వారా సదరు ఎమ్మెల్యేకి శ్రీమతి రాయపాటి అరుణ గారు తెలిపారు. ఆ విషయాన్ని ప్రసారం చేసిన మీడియాని బెదిరించే విధంగా కేసులు నమోదు చేయడం అప్రజాస్వామికం.  ఈ ఘటన విషయంలో ధైర్యంగా ఉండాలని శ్రీమతి అరుణ గారికి ఫోన్ ద్వారా చెప్పాను. ఆడబిడ్డను వేధించిన ఘటనను ప్రసారం చేసిన మహా టీవీ, 99 టీవీ ఛానెళ్లపై కేసులు నమోదు చేయడాన్ని ఖండిస్తున్నాను. మాజీ మంత్రి శ్రీ బాలినేని శ్రీనివాసరెడ్డి గారికి తెలియచేసేది ఒక్కటే -  మీ అనుచరులకు ఇది పధ్ధతి కాదని చెప్పండి. రాజకీయాల్లో విధివిధానాలపై మాట్లాడుకుంటాం... అంతే తప్ప వ్యక్తిగత దూషణలకు దిగడం ఆమోదయోగ్యం కాదు. మహా టీవీ, 99 టీవీ ఛానెళ్లపై పెట్టిన కేసులు ఉపసంహరించుకొని సమస్యకు ముగింపు పలకాలి.