జమ్మలమడుగు నియోజకవర్గంలో స్థానిక చెల్లపల్లి స్కూల్ ప్రక్కన ఉన్న జనసేన పార్టీ కార్యలయం నందు జనసేన క్రియాశీలక సభ్యత్వ కిట్లు మరియూ భీమా పత్రాల పంపిణీ కార్యక్రమం జరిగింది ఈ కార్యక్రమానికీ ముఖ్య అతిధులు గా జనసేన పార్టీ రాష్ట్ర కార్యదర్శి పోలసపల్లి సరోజ గారు , మరియు రాష్ట్ర కార్యక్రమాల కమిటీ కార్యదర్శి సురేష్ బాబు గారు హాజరయ్యారు. ఈ కార్యక్రమాన్ని జమ్మలమడుగు జనసేన నాయకులు అల్లం సుర్యానారాయణ గారి అద్వర్యంలో కడపజిల్లా జనసేన నాయకులు పండ్రా రంజిత్ కుమార్ గారి అధ్యక్షత జరిగింది . జనసేన పార్టీ రాష్ట్ర కార్యదర్శి,కాకినాడ మాజీ మేయర్ శ్రీమతి పోలసపల్లి సరోజ గారు మాట్లాడుతూ
జమ్మలమడుగు జనసైనికుల ఉత్సాహం, పట్టుదల చూస్తుంటే రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో జమ్మలమడుగు నియోజకవర్గంలో జనసేన జెండా ఎగరడం ఖాయంగా కనిపిస్తుందని అన్నారు. ఇంచార్జి లేకున్నా ఒక నిబద్దత గా కార్యక్రమాన్ని నిర్వహించారు అని అభినందించారు.
2024 లో మనం పవన్ కల్యాణ్ గారిని ఆంధ్రప్రదేశ్ రాష్త్ర ముఖ్యమంత్రి గా చెయడమే లక్ష్యం గా పార్టీ పట్ల అంకిత భావం తో పనిచేయాలని కార్యకర్తల్లో ఉత్సహం నింపారు. అందరూ కలిసి ఏకతాటిపైనిలిచి సమిష్టి కృషి చేయాలని సూచించారు. ఆనంతరం సభ్యత్వ కిట్ల పంపిణీ చేసి వలంటీర్లకు సన్మానాలు చేశారు.
కార్యక్రమంలో వీరమహిళలు సులోచన, పుష్పవతి, జనసైనికులు ఆదినారాయణ, సుబ్బు, పవన్, కిరణ్, మనోహర్ తదితరులు పాల్గొన్నారు.