డేగరమూడిలో కౌలు రైతు శ్రీ నీలం రవికుమార్ కుటుంబానికి రూ. లక్ష ఆర్ధిక సాయం



సాగు నష్టాలు, ఆర్ధిక ఇబ్బందులతో  ఆత్మహత్యకు
పాల్పడిన శ్రీ నీలం రవికుమార్ కుటుంబాన్ని జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు ఆదివారం ఉదయం పరామర్శించారు. శ్రీ రవి కుమార్ బలవన్మరణానికి గల కారణాలు, ఆర్థిక పరిస్థితి గురించి కుటుంబ సభ్యులను అడిగి తెలుసుకున్నారు.

పార్టీ తరఫున రూ. లక్ష ఆర్థిక సాయాన్ని రవికుమార్ భార్య శ్రీమతి అశోకరాణికి అందజేశారు. ఇద్దరు బిడ్డలు మహేశ్వరి, కార్తీక్ భవిష్యత్తు, చదువుల బాధ్యతను పార్టీ చూసుకుంటుందని ఈ సందర్భంగా శ్రీ పవన్ కళ్యాణ్ గారు ఆ కుటుంబానికి భరోసా ఇచ్చారు. ఈ కార్యక్రమంలో శ్రీ పవన్ కళ్యాణ్ గారితో పాటు పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్ శ్రీ నాదెండ్ల మనోహర్ గారు, ఉమ్మడి ప్రకాశం జిల్లా అధ్యక్షుడు శ్రీ షేక్ రియాజ్, పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శ్రీ పెదపూడి విజయ్ కుమార్..