ధర్మవరం నియోజకవర్గం తాడిమర్రి మండలం చిల్లకొండాయ పల్లి గ్రామ సమీపంలో గుడ్డంపల్లి గ్రామానికి చెందిన రైతులు వ్యవసాయ పనుల నిమిత్తం ప్రయాణిస్తున్న ఆటో పై విద్యుత్ వైర్లు తగలడంతో ఆటో పూర్తిగా కాలిపోయింది, ఈ ప్రమాదంలో 6 మంది అక్కడికక్కడే చనిపోయారు.
ఈ విషయం తెలుసుకున్న రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శ్రీ చిలకం మధుసూదన్ రెడ్డి గారు, అనంతపురం జిల్లా అధ్యక్షులు శ్రీ టి.సి.వరుణ్ గారు ఘటన స్థలానికి చేరుకొని ప్రమాదం ఎలా జరిగింది అనే విషయంపై పరిశీలిస్తూ మృతుల కుటుంబాన్ని పరామర్శించి భౌతిక కాయాలను పరిశీలించి తీవ్ర ఆవేదనకు గురై మీడియా ముఖంగా మాట్లాడుతూ ఇది కచ్చితంగా ప్రభుత్వ వైఫల్యమేనంటు మృతి చెందిన కుటుంబాలకు వెంటనే 50 లక్షలు ఎక్స్గ్రేషియా ప్రకటించి క్షతగాత్రులకు 10 లక్షల రూపాయలను ప్రకటించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేయడం జరిగింది. అలాగే రాష్ట్ర కార్యనిర్వాహక ప్రధానకార్యదర్శి శ్రీ భవాని రవి కుమార్ గారు, జిల్లా ఉపాధ్యక్షులు శ్రీ జయరాం రెడ్డి గారు, శ్రీ అంకె ఈశ్వరయ్య గారు నాయకులు మరియు కార్యకర్తలు పాల్గొన్నారు.