తెలంగాణకు పాక్ నుండి పేలుడు పదార్దాలు ,,ఆయుధాలు


అనుమానిత ఉగ్రవాదుల  ముఠా గుట్టును పోలీసులు రట్టు చేశారు.
హర్యానాలోని కర్నాల్ లో నలుగురు అనుమానిత ఉగ్రవాదులను అరెస్ట్ చేయటంతో  ఈవ్యవహారం బయటపడింది. వారి వద్దనుంచి పెద్ద ఎత్తున పేలుడు పదార్ధాలు, ఆయుధాలు పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.పాకిస్తాన్ నుండి తెలంగాణకు ఆయుధాలు సరఫరా చేస్తున్నారు ,,పేలుడు పదార్ధాలను ఆర్డీఎక్స్ గా పోలీసులు అనుమానిస్తున్నారు. పేలుడు పదార్ధాలను పరీక్షల నిమిత్తం ఫోరెన్సిక్ ల్యాబరేటరీకి తరలించారు. 

ఫోరెన్సిక్ ల్యాబ్ రిపోర్ట్ ఆధారంగా అవి ఏ రకమైన పేలుడు పదార్ధాలో తెలిసే అవకాశం ఉంది.తెలంగాణలోని ఆదిలాబాద్‌కు ఆయుధాలు చేరవేయాల్సిందిగా నిందితులకు ఆదేశాలు అందినట్టు పోలీసులు గుర్తించారు. పాకిస్తాన్ నుంచి ఆదేశాలు అందుతున్నాయని పోలీసుల దర్యాప్తులో నిందితులు వెల్లడించారు. నిందితుల నుంచి కంటైనర్ గన్ పౌడర్, పేలుడు పదార్థాలు స్వాధీనం చేసుకున్నారు. బాంబు డిస్పోజల్ స్క్వాడ్ ను పిలిపించి వాటిని పరిశీలిస్తున్నారు.